Sunitha Williams : మరో మూడు నెలల పాటు స్పేస్‌లోనే సునీతా విలియమ్స్!
అంతరిక్షంలో(Space) చిక్కుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్(sunitha williams) భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారన్నది నాసా(NASA) శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు.
అంతరిక్షంలో(Space) చిక్కుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్(sunitha williams) భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారన్నది నాసా(NASA) శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు. ఆమె రాక మరింత ఆలస్యం అవుతుందని మాత్రమే చెప్పారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్ లైనర్ స్పేస్ షిప్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు చేరుకున్న సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్‌మోర్ మరో 46 రోజుల నుంచి 90 రోజుల వరకు అక్కడే ఉండాల్సి రావచ్చని నాసా అంచనా వేసింది. . స్టార్‌లైనర్‌లో తలెత్తిన కొన్ని లోపాలను ఇంకా సరిచేయకపోవడమే ఇందుకు కారణం. జూన్ 5వ తేదీన సునీత, విల్‌మోర్ స్పేస్‌కు బయలుదేరారు. స్టార్‌లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. హీలియం గ్యాస్ లీకవుతున్నట్టు గుర్తించారు. థ్రస్టర్లు కూడా మొరాయించాయి. బోయింగ్ సైంటిస్టులు అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు చేసి ఎలాగోలా స్పెస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షానికి తీసుకెళ్లగలిగారు. షెడ్యూల్ ప్రకారం వారిద్దరు తిరిగి రావాల్సి ఉంది. అయితే రిపైర్లు ఇంకా పూర్తిగా జరగలేదు. ఇవన్నీ కంప్లీట్ అయ్యాకే సునీతా విలియమ్స్, విల్‌మోర్ భూమ్మీదకు తిరిగి వస్తారు.