ఉక్రెయిన్, రష్యాల యుద్ధంపై భారత్ తన వైఖరిని మరోసారి స్ఫష్టం చేసి౦ది .. ఉక్రెయిన్ పై యుద్ధం ఆపాలని ప్రవేశ పెట్టిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్‌లో శత్రుత్వానికి ముగింపు పలకాలని, తన బలగాలను ఉపసంహరించుకోవాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ లో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 141 మంది ఓటు వేశారు. 7 దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత్, చైనా లతో సహా 32 దేశాలు ఓటింగ్ లో పాల్గొనలేదు […]

ఉక్రెయిన్, రష్యాల యుద్ధంపై భారత్ తన వైఖరిని మరోసారి స్ఫష్టం చేసి౦ది .. ఉక్రెయిన్ పై యుద్ధం ఆపాలని ప్రవేశ పెట్టిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్‌లో శత్రుత్వానికి ముగింపు పలకాలని, తన బలగాలను ఉపసంహరించుకోవాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ లో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 141 మంది ఓటు వేశారు. 7 దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత్, చైనా లతో సహా 32 దేశాలు ఓటింగ్ లో పాల్గొనలేదు .

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ తన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది. శాంతికి దౌత్యం మాత్రమే ఆచరణీయమైన మార్గమని తెలిపింది . ఉక్రెయిన్‌లో సమగ్రమైన, న్యాయమైన, శాశ్వతమైన శాంతిని చేరుకోవాలని అసెంబ్లీ మాస్కోను కోరింది. 193 మంది సభ్యుల జనరల్ అసెంబ్లీ ..ఉక్రెయిన్, దాని మద్దతు దేశాలు ఈ ముసాయిదా తీర్మానాన్ని తీసుకొచ్చాయి. "భారత్ బహుపాక్షికతకు స్థిరంగా కట్టుబడి ఉంది. UN చార్టర్ యొక్క సూత్రాలను సమర్థిస్తుంది.
శాశ్వత శాంతిని సాధించాలనే లక్ష్యంతో మేము దూరంగా ఉండవలసి ఉంటుంది" అని భారత ప్రతినిధి కాంబోజ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇది యుద్ధ యుగం కాదన్న మన ప్రధాని ప్రకటన పునరుద్ఘాటిస్తుంది. శత్రుత్వం, హింసను పెంచడం ఎవరికీ ప్రయోజనం కలిగించదు" అని చెప్పారు.

ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ అధ్యక్ష కార్యాలయ అధిపతి ఆండ్రీ యెర్మాక్, భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుతో ఐక్యరాజ్యసమితి తీర్మానం గురించి మాట్లాడారు. తమ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కానీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భారత్ ఈ ఓటింగ్ కు దూరంగా ఉంది.

Updated On 25 Feb 2023 6:40 AM GMT
Ehatv

Ehatv

Next Story