రతి క్రీడ .. జీవరాశులకు సంతానాభివృద్ధి కోసం ప్రకృతి ఇచ్చిన అత్యంత ఆనందాన్ని కలిగించే వారం. ఆ ఆనందం, సంతోషం ఇద్దరికీ ఉంటేనే రతిక్రీడకు అర్థం పరమార్థం. అది తెలియకనే ఇన్నేసి అత్యాచారాలు జరుగుతున్నాయి.

రతి క్రీడ .. జీవరాశులకు సంతానాభివృద్ధి కోసం ప్రకృతి ఇచ్చిన అత్యంత ఆనందాన్ని కలిగించే వారం. ఆ ఆనందం, సంతోషం ఇద్దరికీ ఉంటేనే రతిక్రీడకు అర్థం పరమార్థం. అది తెలియకనే ఇన్నేసి అత్యాచారాలు జరుగుతున్నాయి. కామశాస్త్రం పుట్టిన మన భారతదేశంలోనే ఇన్ని దారుణాలు జరగడం ఆశ్చర్యం. మనది సంప్రదాయ దేశమే! అమ్మవారిని ఆరాధించే దేశమే! అయినా తప్పు దిశలో వెళుతున్నదేమోననిపిస్తోంది. పోర్నోగ్రఫీ మాఫియా మన దేశంలో కూడా విజృంభిస్తోంది. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక. చాలా మంది వాటిని సెక్స్‌ వీడియోలో చూడటానికే ఉపయోస్తున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమే! పెద్దలు కాదు, పిల్లలు కూడా దానికి అడిక్ట్‌ అవుతున్నారు. పోర్న్‌ వీడియోలు(Porn Videos) చూడనీయకుండా పిల్లలను అదుపులో పెట్టడం పెద్దల వల్ల కావడం లేదు. మన సినిమాలేమైనా తక్కువ తింటున్నాయా? వాటిల్లోనూ బూతులు, డబుల్‌ మీనింగ్ డైలాగులే! వెబ్‌ సిరీస్‌ల గురించి చెప్పనే అక్కర్లేదు. బహిరంగంగా అనకూడని మాటలన్నీ అందులో ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పోర్నోగ్రఫీ ఇండస్ట్రీ రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఇండియాలో తక్కువే అయినా భయాందోళనలు కలిగించే స్థాయిలోనే ఉంది. ఇప్పుడిది లాభసాటి వ్యాపారంగా మారింది. ఈజీగా డబ్బులు వచ్చిపడుతున్నాయి కాబట్టే రాజ్‌కుంద్ర(Rajkundra)వంటి వ్యాపారవేత్తలు కూడా ఈ ఇండస్ట్రీలో కాలుపెడుతున్నారు. రాజ్‌కుంద్ర బాలీవుడ్‌ నటి శిల్పా షెట్టి(Actor Shilpa Shetty) భర్త అన్న విషయం విదితమే! 30 ఏళ్ల కిందట ప్లేబాయ్‌, హస్టలర్‌, ఫాంటసీ వంటి మాగజైన్‌లు ఉండేవి. వాటిని ఇంటికి తెచ్చుకోవడానికి యువత జంకేది. ఇప్పుడు ఇంటికి సెక్స్‌ వీడియోలే వచ్చేస్తున్నాయి. పోర్నోగ్రఫీ ఉత్పత్తిలో అమెరికా టాప్‌ ప్లేస్‌లో ఉంది. మొత్తం పోర్నోగ్రఫీలో 24.52 శాతం అమెరికా(America)నే ఉత్పత్తి చేస్తోంది. తర్వాతి స్థానం బ్రిటన్‌(Briton)(5.49)ది! 4.90 శాతంతో మూడో ప్లేస్‌లో జర్మనీ(Germani),4.80 శాతంతో నాలుగో స్థానంలో బ్రెజిల్‌(Brezil) ఉన్నాయి. ఫ్రాన్స్(France) (4.01), రష్యా(Russia) (4.01), కెనడా(canada) ( 3.19), ఇండియా(India)(3.18), ఇటలీ(Italy) (2.64), స్పెయిన్(spain) (2.46), నెదర్లాండ్స్(Netherland) (1.92), టర్కీ(Turkey) (1.82), పోలాండ్(Poland) (1.78), ఆస్ట్రేలియా(Australia)(1.55) తర్వాతి స్థానాలలో ఉన్నాయి. భారత్‌ తొమ్మిదో స్థానంలో ఉండటమేమిటి? విలువలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే మన దేశంలో పోర్నోగ్రఫీ ఈ స్థాయిలో ఉన్నదా? మనకంటే ఇటలీ, స్పెయిన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలు నయం! ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. పోర్నోగ్రఫీకి అడ్డుకట్టవేయకపోతే ఫ్యూచర్‌లో మరిన్ని దారుణాలు జరిగే అవకాశం ఉంది.

ehatv

ehatv

Next Story