అమెరికాలోని న్యూహాంప్‌షైర్‌ (New Hampshire)లో భయానక సంఘటన జరిగింది.

అమెరికాలోని న్యూహాంప్‌షైర్‌ (New Hampshire)లో భయానక సంఘటన జరిగింది. అక్కడి ప్రొట్స్‌మౌత్‌ హార్బర్‌ సముద్రంలో ఓ భారీ తిమింగలం (Whale) ఓ బోటుపై దాడి చేసింది. చేపల వేటకు ఉపయోగించే పడవ (vessel capsizes)పై అకస్మాత్తుగా దాడి చేసింది. నీటి లోపలి నుంచి ఒక్కసారిగా గాల్లోకి లేచి బోటుపై పడింది. ఆ దెబ్బకు పడవ బోల్తా పడింది. అదృష్టవశాత్తూ అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు క్షేమంగా బయటపడ్డారు. ఒడియోర్న్‌ పాయింట్‌ స్టేట్‌ పార్క్‌ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లారు. వారు ప్రయాణిస్తున్న పడవ ఇంచుమించు 23 అడుగులు ఉంటుంది. అప్పుడే ఓ భారీ తిమింగలం పడవ దగ్గరకు వచ్చింది. నీళ్లల్లోంచి గాల్లోకి లేచి బోటుపై పడింది. దీంతో బోటు బోల్తా పడింది. తిమింగలాన్ని చూసి భయపడిన ఓ వ్యక్తి సముద్రంలోకి దూకేశాడు. మరో వ్యక్తి నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.



Eha Tv

Eha Tv

Next Story