China : ఆస్తిని 'పిల్లులు, కుక్కల' మీద రాసిన ఓ తల్లి..!
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు(Joint Families) ఉండేవి. తల్లిదండ్రులు, కొడుకు, కోడలు ఉమ్మడిగా ఉండేవారు. కాలం మరింది ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఎవరికివారు వేరు కాపురాలు పెట్టుకుంటున్నారు. కొందరైతే కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్య సమయంలో రోడ్డున పడేస్తున్నారు. మరికొందరు వృద్ధ్యాశ్రమంలో(Oldage home) చేర్చుతున్నారు. చివరి దశలో కన్నవారు కళ్లముందు లేకపోవడంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు ఆవేదన చెందుతుంటారు.
ఓ తల్లి తను కనిపెంచిన పిల్లల మీద విసుగుచెందింది. కాని పెంచుకున్న పిల్లులు, కుక్కల మీద ప్రేమ పెంచుకుంది. దీంతో తనకున్న యవదాస్తిని వాటి పేరుతో వీలునామా రాసింది. చైనాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు(Joint Families) ఉండేవి. తల్లిదండ్రులు, కొడుకు, కోడలు ఉమ్మడిగా ఉండేవారు. కాలం మరింది ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఎవరికివారు వేరు కాపురాలు పెట్టుకుంటున్నారు. కొందరైతే కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్య సమయంలో రోడ్డున పడేస్తున్నారు. మరికొందరు వృద్ధ్యాశ్రమంలో(Oldage home) చేర్చుతున్నారు. చివరి దశలో కన్నవారు కళ్లముందు లేకపోవడంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు ఆవేదన చెందుతుంటారు. కొందరేమో తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. తమ పిల్లలు తమతో రోజూ మాట్లాడాలని.. తమ ఆరోగ్యం గురించి తెలుసుకొని, తమ మంచిచెడులు చూసుకోవాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం.
అయితే తాజాగా చైనాలో(China) ఓ తల్లి తన పిల్లల ప్రవర్తనపై విసుగుచెందింది. లియు అనే మహిళ ఒంటరిగా నివసించేది. ఆమె పిల్లలు ఆమెకు దూరంగా ఉండడమే కాకుండా తనని పట్టించుకోవడమే మానేశారు. పిల్లల ప్రవర్తనతో లియు పూర్తిగా కృంగిపోయింది. దీంతో ఒంటరి తనం నుంచి దూరంగా ఉండేందుకు ఇంట్లో కుక్క, పిల్లులను పెంచుకుంటుంది. లియు తన చివరి రోజుల వరకు ఈ కుక్క, పిల్లితో జీవించింది. తల్లి మరణంతో ఇంటికి వచ్చిన ఆమె పిల్లలు ఆస్తిని తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆమె రాసిన వీలునామా చూసి అవాక్కయ్యారు. మరణానికి ముందు, లియు తన ఆస్తి ఎవరికి చెందాలో వీలునామా రాసింది. ఆమె తన ఆస్తిలో ఒక్క పైసా కూడా తన పిల్లలకు ఇవ్వలేదు. కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువుల పేరుతో ఆస్తులను రాసిపెట్టింది. లియు ఆస్తుల విలువ 2.8 మిలియన్లకు పైగా అంటే భారత కరెన్సీ ప్రకారం 23.27 కోట్లు. కాకపోతే తన కుక్క, పిల్లి సంరక్షణకు పశువైద్యులను చేర్చింది. ఈ జంతువులను జాగ్రత్తగా చూసుకోవడానికి, పెంపుడు జంతువుల కోసం డబ్బును ఉపయోగించుకునే అధికారం వారికి ఉంది.