French Woman Struck By Meteorite : మహిళపై పడ్డ ఉల్క... తరవాత ఏమి జరిగింది
ఫ్రాన్స్(France) లో అరుదైన సంఘటన చోటు చూసుకుంది. మేడపై కూర్చుని ఫ్రెండ్స్ తో కాఫీ తాగుతున్న ఒక మహిళపై ఆకాశంనుంచి వచ్చి ఉల్కా రాలిపడింది. ఆ ఉల్కా వచ్చి నేరుగా ఆ మహిళ ఛాతీపై పడింది. ఆ ఉల్కా రాలుతున్న సమయంలో ఆ మహిళకి ఛాతిలో విద్యుత్ షాక్ తగిలినట్టు అనిపించిందని స్నేహితులకి చెప్పింది. మొదట్లో దానిని జంతువుగా భావించినట్లుగా ఆ మహిళ వివరించింది.
ఫ్రాన్స్(France) లో అరుదైన సంఘటన చోటు చూసుకుంది. మేడపై కూర్చుని ఫ్రెండ్స్ తో కాఫీ తాగుతున్న ఒక మహిళపై ఆకాశంనుంచి వచ్చి ఉల్కా రాలిపడింది. ఆ ఉల్కా వచ్చి నేరుగా ఆ మహిళ ఛాతీపై పడింది. ఆ ఉల్కా రాలుతున్న సమయంలో ఆ మహిళకి ఛాతిలో విద్యుత్ షాక్ తగిలినట్టు అనిపించిందని స్నేహితులకి చెప్పింది. మొదట్లో దానిని జంతువుగా భావించినట్లుగా ఆ మహిళ వివరించింది. సదరు మహిళ భూవిజ్ఞాన శాస్త్రవేత్త థియరీ రెబ్‌మాన్‌ను సంప్రదించింది, అతను శిలలను పరిశీలించి, ఇనుము మరియు సిలికాన్ కూర్పును గమనించి , ఇది ఉల్క కావచ్చునని సూచించాడు. ఉల్క ముక్కలు సుమారు 4 ఔన్సుల బరువు కలిగి ఉన్నాయి. ప్రతిరోజూ 50 టన్నుల ఉల్క పదార్థాలు భూమిపై పడతాయని అంచనా వేసినప్పటికీ, వాటిలో ఎక్కువ భాగం మహాసముద్రాలలోకి పడిపోతున్నప్పటికీ, ప్రజలు ఉల్కల బారిన పడిన సంఘటనలు చాలా అరుదు అని రెబ్మాన్ పేర్కొన్నాడు.
ఈశాన్య ఫ్రాన్స్‌లోని షిర్మెక్ కమ్యూన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.