Imran Khan: నా భార్యకు ఏమైనా జరిగిందో.. ఇమ్రాన్ వార్నింగ్
తన భార్య బుష్రా బీబీ జైలుకెళ్లడానికి ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్
తన భార్య బుష్రా బీబీ జైలుకెళ్లడానికి ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కారణమని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు. బుష్రా బీబీని అవినీతి కేసులో దోషిగా నిర్ధారించారు. ప్రస్తుతం ఇస్లామాబాద్ శివారులోని వారి బని గాలా నివాసంలో బుష్రా బీబీ నిర్బంధంలో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ అధికారిక X ఖాతాలో అప్‌లోడ్ చేసిన సుదీర్ఘ పోస్ట్ ప్రకారం, అడియాలా జైలులో జర్నలిస్టులతో PTI నాయకుడు మాట్లాడారు. ఆర్మీ చీఫ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
నా భార్యకు విధించిన శిక్షలో జనరల్ అసిమ్ మునీర్ ప్రత్యక్షంగా ప్రమేయం కలిగి ఉన్నారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నా భార్యకు ఏదైనా జరిగితే, నేను అసిమ్ మునీర్‌ను విడిచిపెట్టను.. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అసిమ్ మునీర్‌ను విడిచిపెట్టనని హెచ్చరించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) రుణాల ద్వారా కాకుండా పెట్టుబడి ద్వారా మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరపడుతుందని ఖాన్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆరోపణలపై ఇప్పటి వరకు సైన్యం స్పందించలేదు.