ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతి (Nobel peace prize)ఇరాన్‌(Iran)కు చెందిన మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్టు నర్గేస్‌ మొహమ్మదిని వరించింది. ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికిగానూ ఈ అవార్డును ఇవ్వనున్నట్టు నార్వే నోబెల్‌ కమిటీ ప్రకటించింది. గత కొన్నేళ్లుగా మానవ హక్కులు, అందరికీ స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు నర్గేస్‌స ప్రస్తుతం జైలులో ఉన్నారు.

ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతి (Nobel peace prize)ఇరాన్‌(Iran)కు చెందిన మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్టు నర్గేస్‌ మొహమ్మదిని వరించింది. ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికిగానూ ఈ అవార్డును ఇవ్వనున్నట్టు నార్వే నోబెల్‌ కమిటీ ప్రకటించింది. గత కొన్నేళ్లుగా మానవ హక్కులు, అందరికీ స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు నర్గేస్‌స ప్రస్తుతం జైలులో ఉన్నారు. సంప్రదాయం పేరుతో అణచివేతకు గురవుతున్న ఇరానీ మహిళల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు నర్గేస్‌. ఇరాన్‌లో పుట్టిన నర్గేస్‌ చదవుకునే రోజుల నుంచే మహిళాహక్కులపై పోరాడసాగారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం వార్త ప్రతికలకు కాలమిస్టుగా పని చేశారు. 2003లో నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత షిరిన్‌ ఇబాది స్థాపించిన డిఫెండర్స్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ (డీహెచ్‌ఆర్‌సీ) సెంటర్‌లో చేరారు. కొన్నాళ్లకు అదే సంస్థకు ఉపాధ్యక్షురాలయ్యారు. ఆమె జీవితమంతా పోరాటమే! ప్రభుత్వం నర్గేస్‌ను ఎన్నో ఇబ్బందులను పెట్టింది. 13 సార్లు అరెస్ట్‌ చేసింది. అయిదుసార్లు జైలు శిక్ష వేసింది. అయినా లెక్క చేయలేదు. భయపడలేదు. 1998లో ఇరాన్‌ ప్రభుత్వాన్ని విమర్శించినందుకుగాను మొదటిసారి అరెస్టయ్యారు. ఏడాదిపాటు జైల్లోనే ఉన్నారు. అటు పిమ్మట డీహెచ్‌ఆర్‌సీలో చేరినందుకు మరోసారి అరెస్టయ్యారు. 2011లో జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో నర్గేస్‌ను అరెస్ట్‌ చేసింది ప్రభుత్వం. 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయినప్పటికీ ఆమె భయపడలేదు. రెండేళ్ల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇరాన్‌లో విచ్చలవిడిగా అమలు చేస్తున్న మరణశిక్షలకు వ్యతిరేకంగా పోరు మొదలుపెట్టారు. ఈ కారణంగా 2015లో మళ్లీ అరెస్టయ్యారు. జైలులో కూడా ఆమె పోరాటాన్ని ఆపలేదు. రాజకీయ ఖైదీలు, మహిళల పట్ల జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా జైల్లోనే ఉద్యమం మొదలుపెట్టారు. మహిళా ఖైదీల నుంచి ఆమెకు విపరీతమైన మద్దతు లభించడంతో ప్రభుత్వంలో ఆందోళన మొదలయ్యింది. దాంతో ఆమెపై కఠినమైన ఆంక్షలు విధించారు. ఆమె ఎవరితోనూ మాట్లాడకుండా, కలవకుండా నిషేధం విధించారు. నిరుడు సెప్టెంబర్‌లో హిజాబ్‌ ధరించనందుకు మాసా అనే యువతిని ఇరాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కస్టడీలో ఆమె తీవ్రంగా గాయపడి చనిపోయారు. ఈ ఘటన దేశాన్ని కదిలించింది. పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. అప్పుడు కూడా నర్గేస్‌ తన స్వరాన్ని గట్టిగా వినిపించారు. జైలు నుంచే పలు అంతర్జాతీయ పత్రికలకు వ్యాసాలు రాశారు. న్యూయార్క్‌ టైమ్స్‌, బీబీసీ వంటి వాటిల్లో ఆమె కాలమ్స్‌ వచ్చాయి. నోబెల్‌ బహుమతుల్లో శాంతి బహుమతి ప్రత్యేకమైనది. నార్వే నోబెల్ కమిటీ ఓస్లోలో శాంతి బహుమతిని అనౌన్స్‌ చేస్తుంది.

Updated On 6 Oct 2023 6:23 AM GMT
Ehatv

Ehatv

Next Story