ఈ నెల 5వ తేదీన బంగాళాఖాతంలో(Bay of bengal) మరో అల్పపీడనం ఏర్పడబోతున్నదని వాతావరణ శాఖ తెలిపింది

ఈ నెల 5వ తేదీన బంగాళాఖాతంలో(Bay of bengal) మరో అల్పపీడనం ఏర్పడబోతున్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పలు చోట్ల వర్షాలు కురుస్తాయని కూడా చెప్పింది. మనం ఎప్పుడూ బంగాళాఖాతంలో అల్పపీడనాలు, తుఫాన్‌ల గురించే విన్నాం. తుఫాన్‌లు చేసే బీభత్సాన్ని కళ్లారా చూశాం! కానీ అరేబియా సముద్రంలో(Arabian Sea) తుఫాన్‌లు(Typhoon) ఏర్పడటమన్నది ఎప్పుడో కానీ వినం. అది కూడా ఆగస్టు నెలలో తుఫాన్‌ ఏర్పడటమన్నది చాలా చాలా అరుదు. అరేబియా సముద్ర పశ్చిమ ప్రాంత జలాలు ఎప్పుడూ చల్లగా ఉంటాయి. చల్లని జలాలు తుఫాన్లు ఏర్పడటానికి అనువైనవి కావు. అరేబియా ద్వీపకల్ప భూభాగాల నుంచి వీచే పొడిగాలులు కూడా ఇక్కడ తుఫాన్లను ఏర్పరచలేవు. అయితే మొన్న గుజరాత్‌ తీరాన్ని దాడుతూ తుఫాన్‌ ఏర్పడటంతో వాతావరణ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. చివరిసారిగా 1976లో అరేబియాలో తుఫాన్‌ ఏర్పడింది. మళ్లీ ఇప్పుడే!

వర్షాకాలంలో అరేబియా సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌కన్నా తక్కువగా ఉంటుంది. దీంతో జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో తుఫాన్‌లు ఏర్పడటం కష్టం. అల్పపీడనం ఏర్పడినపుడు గంటకు 52–61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అదే తుఫాన్‌ ఏర్పడితే గంటకు 63–87 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తుఫాన్‌ ఏర్పడాలంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కచ్చితంగా 26.5 డిగ్రీల సెల్సియస్‌ను మించి ఉండాలి. ఆగస్టులో ఇంత ఉష్ణోగ్రత ఉండదు కాబట్టే తుఫాన్‌లు ఏర్పడవు. అదే బంగాళాఖాతంలో ఉండే వాతావరణం తుఫాన్‌లు ఏర్పడటానికి అత్యంత అనువుగా ఉంటుంది.

Eha Tv

Eha Tv

Next Story