అనాదిగా మనల్ని రోగాలు పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ప్లేగు(Plague) లాంటి భయంకరవ్యాధులైతే లక్షలాది మంది ఉసురు తీసుకున్నాయి. మొన్నటికి మొన్న కరోనా(Corona) మనల్ని ఎంతగా హింస పెట్టిందో ప్రత్యక్షంగా అనుభవించాం! ఆ రక్కసి కూడా అనేక మంది ప్రాణాలను బలిగొంది. ఈ క్రమంలో మనం ఎన్నో వ్యాధుల గురించి విన్నాం. కానీ ఈ వింత వ్యాధి గురించి వినే ఛాన్సే లేదు.

అనాదిగా మనల్ని రోగాలు పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ప్లేగు(Plague) లాంటి భయంకరవ్యాధులైతే లక్షలాది మంది ఉసురు తీసుకున్నాయి. మొన్నటికి మొన్న కరోనా(Corona) మనల్ని ఎంతగా హింస పెట్టిందో ప్రత్యక్షంగా అనుభవించాం! ఆ రక్కసి కూడా అనేక మంది ప్రాణాలను బలిగొంది. ఈ క్రమంలో మనం ఎన్నో వ్యాధుల గురించి విన్నాం. కానీ ఈ వింత వ్యాధి గురించి వినే ఛాన్సే లేదు. అసలు అలాంటి రోగం ఒకటుందని కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ వ్యాధి సోకిన మనిషి నాన్‌స్టాప్‌గా డాన్స్‌ చేస్తూనే ఉంటాడట. ఒకరిద్దరికో ఈ వ్యాధి సోకితే ఏమో అనుకోవచ్చు కానీ వందలాది మంది ఈ విచిత్ర రోగంతో అల్లాడిపోయారట! సుమారు అయిదు శతాబ్దాల కిందట.. సరిగ్గా చెప్పాలంటే 1518లో ఫ్రాన్స్‌(France)లో వచ్చిన ఈ వింత వ్యాధి అప్పట్లో ప్రజలను బెంబేలెత్తించింది. అల్సాస్‌(Alsace)లోని స్ట్రాస్‌బర్గ్‌(Strasbourg) నగరంలో సోకిన ఈ వ్యాధి చాలా వేగంగా విస్తరించింది. ఈ వ్యాధి వచ్చిన వారికి డాన్స్‌ చేయాలనే కోరిక పుడుతుందట. ఆపకుండా భయంకరంగా నృత్యం చేస్తూనే ఉంటాడట. ఎంతసేపూ అంటే.. అతడికి ఓపిక ఉన్నంత సేపు.. అలసిసొలసి మూర్ఛపోయేంతసేపు.. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌ వీధుల్లో ట్రోఫీ(Troffea) అనే మహిళ ఇలాగే నృత్యం చేస్తూ జనాలకు కనిపించిందట! అప్పుడు ప్రజలు దీన్ని సీరియస్‌గా తీసుకోలేదట! ఏదో సరదాపుట్టో, పిచ్చి పట్టో అలా చేస్తుందని అనుకున్నారట! కానీ అమె అదే పనిగా ఏకాంతంగా కూడా నృత్యం చేస్తుందనే విషయం ఊరంతా (అప్పుడది ఊరే మరి) తెలిసిపోయింది. ఇది జరిగిన కొన్ని రోజులకు మరో ముగ్గురు ఆమెలాగే డాన్స్‌లు చేయడం మొదలు పెట్టారు.

అప్పుడు ప్రజల్లో అనుమానంతో కూడిన భయం వేసింది. ఇంకొన్ని రోజులకు ఆ సంఖ్య వందలకు చేరుకుంది. ఏదో పిచ్చిపట్టినట్టుగా నాన్‌స్టాప్‌గా డాన్స్‌ చేయడం ప్రారంభించారు. సుమారు 400 మందికి ఈ వింతవ్యాధి పట్టుకుది. వారంతా కుప్పకూలిపడిపోయేంత వరకు డాన్స్‌లు చేస్తూ ఉండేవారట! చివరికి శరీరం మెలికలు తిరిగి మూర్ఛపోయి పడిపోయేవారట! ఇలాగని చరిత్ర పుస్తకాల్లో ఉంది. వారిని నృత్యం చేయకుండా ఆపడం ఆ బ్రహ్మతరం కూడా అయ్యేది కాదని అంటుంటారు. పోనీ వారి డాన్స్‌ ఏమైనా ఆనందంతో సంబరంతో చేసినట్టు ఉండేదా అంటే కాదు! ఏదో హింసాత్మకంగా వుండేది. వారి మొహాల్లో నిరాశ నిస్పృహలు గోచరించేవి. ఏదో పోగొట్టుకున్నట్టుగా విలయ తాండవం చేసేవారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తున్నదో, ఎలా సోకుతున్నాదో ఎవరికీ అర్థం కాలేదు. ఈ వ్యాధిని ఎలా నిర్వచించాలో కూడా ఆనాటి వైద్య నిపుణులకు అర్థం కాలేదు. ఆపుకోలేని నృత్య కోరిక ఈ వ్యాధి లక్షణం కాబట్టి డ్యాన్స్‌ ప్లేగు అని పేరు పెట్టారు. ఈ రోగాన్ని ఎలా నియంత్రించాలో అర్థం కాలేదు. ఎలా వ్యాప్తి చెందుతున్నదో కూడా తెలియదప్పుడు. ఏం చేయాలో అర్థం కాక, ఆ వ్యాధి సోకిన వారి కోసం ప్రత్యేకంగా ఓ హాల్‌ను ఏర్పాటు చేశారు. అందులో వారంతా మూర్ఛవచ్చి పడిపోయేంత వరకు డాన్స్‌లు చేసుకుంటారు. దీనివల్ల వ్యాధి వ్యాప్తిచెందదన్నది అధికారుల భావన! అసలు ఈ డ్యాన్స్‌ ప్లేగు వ్యాధికి కారణమేఇమటో ఎవరికీ తెలియలేదు. కొందరు దీన్ని హిస్టీరియా లక్షణమని అన్నారు. ఆర్ధిక కష్టాలతో ఇలా చేస్తున్నారని తెలిపారు. ఇది మనిషి విపరీతమైన ప్రవర్తనకు సంబంధించిన వ్యాధి అని మరికొందరన్నారు. సైకోట్రోపిక్‌ పదార్థాలను ఉపయోగించడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని కొందరు భావించారు. నృత్యశాస్త్రంలో దీని ప్రస్తావన ఉందని, అక్కడ్నుంచే సామూహిక నృత్యం వచ్చిందని నమ్మేవాళ్లు కూడా లేకపోలేదు. చిత్రమేమిటంటే ఈ విచిత్రమైన అంతుపట్టని డ్యాన్స్‌ ప్లేగు(Dancing Plague) అనే వ్యాధి ఎందుకు వచ్చిందో ఇప్పటికీ తెలియకపోవడం..! అంతుచిక్కని మిస్టరీలా అది ఉండిపోయింది..

Updated On 26 July 2023 6:53 AM GMT
Ehatv

Ehatv

Next Story