Amazon : మరుగుపడిన 3 వేల ఏళ్ల నాటి మహానగరం.. ఇన్నాళ్లకు బయటపడింది!
మూడువేల సంవత్సరాల కిందటి మహానగరం ఇన్నాళ్లకు వెలుగులోకి వచ్చింది. మరుగుపడిన ఆ మహానగరాన్ని ఈక్వెడార్‌లోని(Ecuador) అమెజాన్ (Amazon)అడవుల్లో పరిశోధకులు గుర్తించారు. ఇళ్లు, వ్యాపారప్రదేశాలు, సారవంతమైన నేలలు, వినోదసముదాయలతో విలసిల్లిన అపానో( Upano) లోయలోని ఈ పురాతననగరం రోడ్లు, కాలువల ద్వారా అనుసంధానమై ఉందంటున్నారు పరిశోధకులు. లిడార్ అనే ప్రముఖ రిమోట్ సెన్సింగ్(Remote Sensing) పద్దతి ద్వారాఈ నగరాన్ని కనుగొన్నారు.
మూడువేల సంవత్సరాల కిందటి మహానగరం ఇన్నాళ్లకు వెలుగులోకి వచ్చింది. మరుగుపడిన ఆ మహానగరాన్ని ఈక్వెడార్‌లోని(Ecuador) అమెజాన్ (Amazon)అడవుల్లో పరిశోధకులు గుర్తించారు. ఇళ్లు, వ్యాపారప్రదేశాలు, సారవంతమైన నేలలు, వినోదసముదాయలతో విలసిల్లిన అపానో( Upano) లోయలోని ఈ పురాతననగరం రోడ్లు, కాలువల ద్వారా అనుసంధానమై ఉందంటున్నారు పరిశోధకులు. లిడార్ అనే ప్రముఖ రిమోట్ సెన్సింగ్(Remote Sensing) పద్దతి ద్వారాఈ నగరాన్ని కనుగొన్నారు. అమెజాన్‌లో ఇదే పురాతనమైన ప్రాంతమని, అమెజాన్ సంస్కృతులను చూసే దృక్కోణాన్ని ఈ నగరం మార్చేస్తుందని చెబుతున్నారు. చాలా మంది ప్రజలు చిన్న చిన్న సమూహాలుగా గుడిసెల్లో(Huts) నివసిస్తూ భూమిని చదును చేస్తూ ఉండేవారని, బహుశా వారు దిగంబరులై ఉండి ఉంటారని పరిశోధకులు అంటున్నారు. మన పూర్వీకులు సంక్లిష్టమైన పట్టణ సమాజాల్లో నివసించారనే విషయాన్ని ఇది తెలియజేస్తుందని ఈ అధ్యయన రచయితలు తెలిపారు. ఈ లిడార్ సర్వేను 2015లోనే నిర్వహించినా ఫలితాలను ఇప్పుడు ప్రచురించారు. ఆనాటి ఈ ప్రాచీన నగరంలోని(Ancient city) చెక్క భవనాల్లో చలి కాచుకొనే ప్రదేశాలను గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు.