How to get back Blue tick on Twitter: బ్లూటిక్ తిరిగి పొందాలంటే వెంటనే .. ఇలా చేయండి.!
ప్రముఖ రాజకీయ ,క్రీడారంగ,సినీ సెలబ్రిటీల బ్లూ టిక్‌లు (Blue Tick)ఈ రోజు ట్విట్టర్లో తొలగించి అందరికి షాక్ ఇచ్చాడు ఎలోన్ మాస్క్( Elon Musk). చాల కాలం క్రితం ట్విట్టర్ (twitter)కంపెనీ ప్రకటించిన విధంగానే పైడ్ వెర్షన్ లో మాత్రమే అధికారిక ఖాతాలపై మాత్రమే ధృవీకరణ చెక్‌మార్క్‌ను (బ్లూ టిక్ )కొనసాగిస్తామని తెలిపింది .
ప్రముఖ రాజకీయ ,క్రీడారంగ,సినీ సెలబ్రిటీల బ్లూ టిక్‌లు (Blue Tick)ఈ రోజు ట్విట్టర్లో తొలగించి అందరికి షాక్ ఇచ్చాడు ఎలోన్ మాస్క్( Elon Musk). చాల కాలం క్రితం ట్విట్టర్ (twitter)కంపెనీ ప్రకటించిన విధంగానే పైడ్ వెర్షన్ లో మాత్రమే అధికారిక ఖాతాలపై మాత్రమే ధృవీకరణ చెక్‌మార్క్‌ను (బ్లూ టిక్ )కొనసాగిస్తామని తెలిపింది .
షారుఖ్ ఖాన్(Shah Rukh Khan,), విరాట్ కోహ్లీ(Virat Kohli), సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar), మార్క్ జుకర్‌బర్గ్‌ల(Mark Zuckerberg)తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల తో సహా ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే (Jack Dorsey)కూడా ట్విట్టర్‌లో(twitter) తమ బ్లూ టిక్‌లను కోల్పోయారు. ఈ గ్లోబల్ ఐకాన్‌లన్నింటికీ మిలియన్ల కొద్దీ ఫాల్లోవెర్స్ ఉన్నారు. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ కోసం ఎంత మంది సెలబ్‌లు చెల్లించకుండా తప్పించుకున్నారనేది ఈ రోజు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సెలబ్రిటీల ఫ్యాన్ క్లబ్ హ్యాండిల్స్ బ్లూ టిక్‌కు సబ్‌స్క్రైబ్ అయ్యాయి.అయితే ఏం చేస్తే బ్లూ టిక్ కోసం ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫీజు ఎంత ఉంటుంది:
Twitterలో బ్లూ టిక్ పొందడానికి, USలోని వినియోగదారులు నెలకు $7 చెల్లించాలి. మరోవైపు ఇండియాలో యూజర్స్ కి అయితే నెలకు రూ.900, ఏడాదికి రూ.9,400 ఫీజుగా నిర్ణయించటం జరిగింది . మెంబర్‌షిప్ ధర ఒక్కో దేశానికి భిన్నంగా ఉంటుందని ఎలాన్ మస్క్ చెప్పారు.
బ్లూ టిక్ (blue Tick)పొందడానికి ఇవి తప్పనిసరిగా చేయాలి :
మీ ఖాతాలో తప్పనిసరిగా డిస్ప్లే నేమ్ ఇంకా ప్రొఫైల్ ఫోటో ఉండాలి.
Twitter బ్లూకు టిక్ సభ్యత్వం పొందడానికి మీ అకౌంట్ గత 30 రోజులుగా తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉండాలి.
మీ ఖాతా తప్పకుండా సబ్‌స్క్రిప్షన్ తేదీ నుండి 30 రోజుల కంటే పాతదిగా ఉండాలి. అలాగే ధృవీకరించబడిన సంఖ్యలో ఫాల్లోవెర్స్ ఉండాలి.
మీ అకౌంట్ లో మీ ప్రొఫైల్ ఫోటో, పేరు లేదా యూజర్ పేరు (@హ్యాండిల్)లో ఇటీవలి మార్పులు ఉండకూడదు.
మీ అకౌంట్లో కంటెంట్ సరైనదిగా ఉండాలి.
మీ అకౌంట్లో ప్లాట్‌ఫారమ్ మానిప్యులేషన్ ఇంకా స్పామ్‌లో ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు ఉండకూడదు.
ఒకసారి Twitter బ్లూ టిక్ అర్హత పొందిన వారి అకౌంట్ రివ్యూ చేశాక అన్ని అవసరాలకు అనుగుణంగా ఉంటే మాత్రమే ,అన్ని షరతులకు అనుగుణంగా ఉన్నపుడు మాత్రమే బ్లూ టిక్ ఇవ్వబడుతుంది.
ఈ మార్పు ఫలితంగా,ఇక మీదట బ్లూ వెరిఫికేషన్ చెక్‌మార్క్‌ల కోసం Twitter ఇకపై దరఖాస్తులను అంగీకరించదు అని గమనించాలి .