Solar Eclipse : సంపూర్ణ సూర్యగ్రహణం...గత ప్రయోగాలతో సాధించిందేమిట?
సంపూర్ణ సూర్యగ్రహణం(Solar eclipse) ఎప్పుడొచ్చినా శాస్త్రవేత్తలంతా ప్రయోగాలకు సిద్ధమవుతుంటారు. నిజం చెప్పలంటే ఇప్పుడు చేపడుతున్న ప్రయోగాలు, అధ్యయనాలు గతంలో గ్రహణ సమయాలలో చేసిన ప్రయోగాల వల్లే సాధ్యమయ్యాయి.
సంపూర్ణ సూర్యగ్రహణం(Solar eclipse) ఎప్పుడొచ్చినా శాస్త్రవేత్తలంతా ప్రయోగాలకు సిద్ధమవుతుంటారు. నిజం చెప్పలంటే ఇప్పుడు చేపడుతున్న ప్రయోగాలు, అధ్యయనాలు గతంలో గ్రహణ సమయాలలో చేసిన ప్రయోగాల వల్లే సాధ్యమయ్యాయి. వాటి వల్ల అనేక ముఖ్యమైన ఆవిష్కరణలు జరిగాయి. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్(Einstine) ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతాన్ని 1999 మే 19న ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో తీసిన చిత్రం సహాయంతో నిరూపించారు ఆర్థర్ ఎడ్డింగ్‌టన్.
1868లో సూర్య గ్రహణాన్ని రికార్డు చేస్తున్న సమయంలోనే హీలియం (Helium) మూలకాన్ని కనుగొన్నారు.చంద్రగ్రహణ సమయంలో భూమిపై ఏర్పడిన నీడను ఆధారంగా చేసుకుని భూమి బల్లపరుపుగా లేదని, గుండ్రంగా ఉందని నిరూపించారు అరిస్టాటిల్. అందుకే సూర్యగ్రహణంపై సైంటిస్టులు అంత ఆసక్తిని చూపిస్తుంటారు.