Satya Ndedla Salary : సత్య నాదేళ్ల జీతం ఎంత పెరిగిందో తెలుసా..!
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రాసాఫ్ట్(Micro soft) సీఈవో సత్య నాదేళ్ల(Satya nadendla) జీతం అమాంతం పెరిగిపోయింది.
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రాసాఫ్ట్(Micro soft) సీఈవో సత్య నాదేళ్ల(Satya nadedla) జీతం అమాంతం పెరిగిపోయింది. ఆయన జీతం దాదాపు 63 శాతం పెరిగింది. 2023లో 48.5 మిలియన్ డాలర్లుగా ఉన్నా సత్య నాదేళ్ల శాలరీ(Salary) ప్రస్తుతం 79.1 మిలియన్ డాలర్ల అంటే భారత కరెన్సీలో 665 కోట్లకు చేరుకుంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సత్య నాదేళ్లకు సేవలకు గాను 5.2 మిలియన్ డాలర్ల నగదు ప్రోత్సాహకం కూడా అందనుంది. గత పదేళ్లుగా మైక్రోసాఫ్ట్‌లో అనేక కొత్త ఆవిష్కరణలకు సత్య నాదేళ్ల నాంది పలికారు. సత్య నాదేళ్ల మైక్రోసాఫ్ట్‌లో చేరక ముందు మందకొడిగా సాగేది. ఆయన చేరిన తర్వాత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్‌పై దృష్టి సారించి మైక్రోసాఫ్ట్‌ను పరుగులుపెట్టించారు. మార్కెట్ వర్గాలు మైక్రోసాఫ్ట్ మీద ఆధారపడడంతో దాని షేర్ అమాంతం పెరిగిపోయింది. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10 వేల డాలర్లతో మైక్రోసాఫ్ట్ షేర్లు కొనుగోలు చేస్తే, ఆ షేర్ల విలువ ఇప్పుడు 1,13,000 డాలర్లకుపైగా ఉంది. 2023లో మైక్రోసాఫ్ట్ వృద్ధి చెందింది. ఈ కంపెనీ షేర్లు దాదాపు 31.2 శాతం లాభపడ్డాయి.