Government Formation : 11 వారాల తర్వాతే కొత్త ప్రభుత్వం
చాలా దేశాలలో ఎన్నికలు(election) పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వ(government) ఏర్పాటు వీలైనంత వేగంగా జరుగుతుంది
చాలా దేశాలలో ఎన్నికలు(election) పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వ(government) ఏర్పాటు వీలైనంత వేగంగా జరుగుతుంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా(america presidant electio) ఎన్నికైన వ్యక్తి 11 వారాలు ఎదురు చూడాలి. ఈ సమయంలో కీలకమైన ప్రభుత్వ బాధ్యతల మార్పిడి జరుగుతుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ మార్పిడికి గరిష్ఠంగా నాలుగు నెలల సమయం తీసుకోవచ్చు. అయితే నాలుగు నెలల సుదీర్ఘ సమయం తీసుకోవడంతో మహా మాంద్యం సమయంలో అనేక సవాళ్ళు ఎదురయ్యాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని నాలుగు నెలల నుంచి మూడు నెలలకు తగ్గించారు. 1933లో ఆమోదించబడిన 20వ రాజ్యాంగ సవరణ ప్రకారం కొత్త ప్రభుత్వ పాలన ప్రారంభ తేదీ జనవరి 20కి మారింది. అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి, తన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకొని, యంత్రాంగాన్ని సిద్ధం చేసుకొని, అందరూ పరిపాలనా కేంద్రానికి చేరుకొని అన్నివిధాలా సంసిద్ధంగా ఉండడం కోసం ఇంత సమయాన్ని ఇచ్చారు. ఈ సమయంలో విజేతకు ట్రాన్సిషన్ ఫండింగ్‌కు అనుమతి ఇస్తారు. అంతేకాదు దిగిపోనున్న ప్రభుత్వం నుంచి అవసరమైన వివరాలను అడిగి తీసుకోవచ్చు.