Christmas Tree : క్రీస్తు పుట్టినరోజుకు క్రిస్మస్ ట్రీకి సంబంధమేమిటి?
ప్రపంచం అంతటా క్రిస్మస్(Christmas) శోభ! విద్యుత్ దీపాలతో చర్చిలు వెలిగిపోతున్నాయి. ప్రభువును ప్రార్థించడానికి శ్రావ్యమైన స్వరాలు గొంతులు సవరించుకుంటున్నాయి. క్రీస్తు పుట్టిన రోజు పండుగ కోసం ఎదురుచూస్తున్నాయి. క్రిస్మస్ పండుగ రోజున చర్చిలలో, ఇళ్లల్లో విద్యుద్దీపాల వెలుగులో ధగధగమనే ఓ చెట్టు కనిపిస్తుంది మనకు! అది క్రిస్మస్ చెట్టు(Christmas tree). క్రీస్తు పుట్టిన రోజుకు క్రిస్మస్ చెట్టుకు ఉన్న సంబంధమేమిటో ? ఆ చెట్టుకు ఎందుకు అలంకరిస్తారో ? ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలయ్యిందో ? పండుగ సందర్భాన తెలుసుకుందాం!
ప్రపంచం అంతటా క్రిస్మస్(Christmas) శోభ! విద్యుత్ దీపాలతో చర్చిలు వెలిగిపోతున్నాయి. ప్రభువును ప్రార్థించడానికి శ్రావ్యమైన స్వరాలు గొంతులు సవరించుకుంటున్నాయి. క్రీస్తు పుట్టిన రోజు పండుగ కోసం ఎదురుచూస్తున్నాయి. క్రిస్మస్ పండుగ రోజున చర్చిలలో, ఇళ్లల్లో విద్యుద్దీపాల వెలుగులో ధగధగమనే ఓ చెట్టు కనిపిస్తుంది మనకు! అది క్రిస్మస్ చెట్టు(Christmas tree). క్రీస్తు పుట్టిన రోజుకు క్రిస్మస్ చెట్టుకు ఉన్న సంబంధమేమిటో ? ఆ చెట్టుకు ఎందుకు అలంకరిస్తారో ? ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలయ్యిందో ? పండుగ సందర్భాన తెలుసుకుందాం!
క్రిస్మస్ పండుగలో మనకు ప్రత్యేకంగా కనిపించేది క్రిస్మస్ చెట్టు. ఎక్కడ చూసినా మనకు అందంగా అలంకరించిన క్రిస్మస్ చెట్లే కనిపిస్తాయి. క్రిస్మస్ ట్రీ గురించి ఎన్నో కథలు ఉన్నాయి. వాటిల్లో ప్రముఖమైన గాథ ఒకటుంది. క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దంలో సెయింట్ బోనీఫస్(Saint Boniface) సువార్త సేవల కోసం జర్మనీకి వెళ్లారు. అక్కడ ఆదివాసులు ఓక్ చెట్టుకు పూజలు చేసి సంబరాలు జరుపుకోవడాన్ని గమనించారు. ఆ చెట్టును దైవసమానంగా భావిస్తూ నరబలి కూడా ఇచ్చేవారట! ఇది బోనీఫస్‌ను అమితంగా బాధించింది. ఆ దురాచారాన్ని తుదముట్టించాలనుకున్నారు. ఆదివాసులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సదా క్రీస్తువైపుకు దారిని చూపించే ఫర్ చెట్టును పూజించాల్సిందిగా వారికి చెప్పారు. మనుషులను పాప విముక్తులను చేయడానికే ఏసు శిలువ(Cross) ఎక్కారని. ఆ కారణంగా మీరు నరబలులు ఆపేయాలని ఉపదేశించారు. ఈ చెట్టు కొమ్మలను ఇళ్లకు తీసుకెళ్లి అందంగా అలంకరించి ఆనందంగా పండుగ చేసుకోమని ఆదేశించారు. అప్పటి నుంచి క్రిస్మస్ పండుగ రోజున ఫర్ చెట్టును అలంకరించడం ఆనవాయితీగా మారింది.
మరో కథ కూడా ఉంది. అప్పట్లో క్రిస్మస్ రోజున చర్చికి (Church)వెళ్లి. కానుకలను ఇవ్వడం సంప్రదాయంగా ఉండేది. ఓ ఊరిలో నివసిస్తున్న ప్లాబో అనే పేదపిల్లోడి దగ్గర కానుకలివ్వడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఏంచేయాలో పాలుపోలేదా పిల్లోడికి! ఇంటి ముందున్న ఓ అందమైన మొక్కను చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి వెళతాడు. ప్లాబో తెచ్చిన కానుకను చూసి అందరూ నవ్వుతారు. ప్లాబో సిగ్గుపడుతూనే ఆ మొక్కను క్రీస్తు విగ్రహం దగ్గర పెడతాడు. ఆశ్చర్యంగా అప్పటికప్పుడు ఆ చిన్నమొక్కే పెద్దగా ఎదిగి బంగారు చెట్టుగా(Golden tree) మారిపోతుంది.. ఆ బాలుడిని ఎగతాళి చేసినందుకు తలలు వంచుకున్నారంతా! కానుకను సహృదయంతో ఇవ్వడమే ప్రధానమని తెలుసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం క్రిస్మస్ చెట్టును అలంకరించడం ఆనవాయితీగా మారింది.
క్రిస్మస్ చెట్టుకు బోలెడన్ని విశేషాలున్నాయి. క్రిస్మస్ పర్వదినాన ఫర్ చెట్టును అలంకరించడమే సంప్రదాయం పదో శతాబ్దంలో జర్మనీలో(Germany) మొదలయ్యింది. 1832లో ప్రొఫెసర్ చార్లెస్ ఫోలెన్ క్రిస్మస్ ట్రీని క్యాండిల్ దీపాలతో అలంకరించాడు. విద్యుత్‌దీపాలతో అలంకరించడమన్నది 1882 నుంచి మొదలయ్యింది. యూరప్‌లో(Europe) ఏడాది సుమారు ఆరు కోట్ల క్రిస్మస్ చెట్లను పెంచుతారు. ఇక వీటి కోసం అమెరికావాళ్లు ఏడాదికి 1.8 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారట! దాదాపుగా లక్షమంది ఉద్యోగులు క్రిస్మస్ ట్రీ ఇండస్ర్టీలో పని చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పదిలక్షల ఎకరాల్లో క్రిస్మస్ చెట్లను పెంచుతున్నారు. ఎకరానికి రెండు వేల చెట్ల చొప్పున పెంచుతారు. ప్రతి ఏడాది ఎనిమిది కోట్ల చెట్లను నాటుతారు. సాధారణంగా స్కాట్చ్, పైన్, డగ్లస్‌ఫర్, ఫ్రాసర్‌ఫర్, బాల్సమ్‌ఫమర్, వైట్‌పైన్ మొక్కలను క్రిస్మస్ ట్రీలుగా వాడతారు. ఇండియాలో ఫర్ చెట్టు లేదు కాబట్టే దగ్గర పోలికలతో ఉన్న సరివి చెట్టును క్రిస్మస్ ట్రీగా ఉపయోగిస్తున్నారు.