Forgot Lunch, Won a Fortune:లంచ్ బాక్స్ మర్చిపోయాడు.. కానీ కోటీశ్వరుడయ్యాడు.. ఏంటా కథ..!
ఓ కామన్ మ్యాన్ ఓ కంపెనీలో సాధారణ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతను ఉద్యోగానికి వెళ్లే సమయంలో లంచ్ బాక్స్ మర్చిపోయాడు.
ఓ కామన్ మ్యాన్ ఓ కంపెనీలో సాధారణ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతను ఉద్యోగానికి వెళ్లే సమయంలో లంచ్ బాక్స్ మర్చిపోయాడు. భార్య లంచ్ బాక్స్ మర్చిపోయావని కాల్ చేసింది. దీంతో బయట ఎక్కడైనా లంచ్ చేద్దామనుకున్నాడు. లంచ్ కోసం బయటకెళ్లాడు. లంచ్ చేశాక పక్కనే ఉన్న ఓ కిరాణషాపులో లాటరీ టికెట్ కొన్నాడు. అదే టికెట్‌కు లాటరీ తగిలింది. ఇగ చూస్కో ఎన్ని కోట్లు వచ్చి పడ్డాయో..!
అమెరికాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన ఓ ఉద్యోగి.. తను ఆఫీస్‌కు వెళ్లే హడావిడిలో ఉండి లంచ్ బాక్స్ మర్చిపోయాడు. అతని భార్య ఫోన్ చేసి లంచ్ బాక్స్ మర్చిపోయినట్లు తెలిపింది. లంచ్ కోసం మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లలేక బయటే ఎక్కడో ఒక చోట తిందామనుకున్నాడు. బయటకు వెళ్లి లంచ్ తిని పక్కనే ఉన్న ఓ కిరాణషాపులో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఇంకేముంది.. మనోడికి లక్కు తన్నుకుంటూ వచ్చింది. ఏకంగా రూ.25.24 కోట్లు (3 మిలియన్ డాలర్లు) లాటరీ అతను కొనుగోలు చేసిన టికెట్‌కు తగిలింది. మిస్సౌరీ లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి లాటరీ తగిలిందని సమాచారం ఇచ్చారు. తొలుత నమ్మకపోయినప్పటికీ నిర్వాహకులు మరింత గట్టిగా చెప్పడంతో మరింత నమ్మారు. ఆ తరువాత టికెట్ నెంబర్ చూసుకుని నిర్దారించుకుని, తెగ సంతోషపడ్డాడు. ఇదే విషయాన్ని భార్యతో చెప్పగా ఆమె కూడా నమ్మలేదు. కానీ మొత్తానికి నిజమనే నమ్మేసింది. మొత్తానికి లంచ్ బాక్స్ మర్చిపోవడంతో ఏకంగా కోటీశ్వరుడయ్యాడు. తంతె గారెల బుట్టలో పడ్డాడు.