Iran Warning : ఇజ్రాయెల్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..!
ఇజ్రాయెల్‌ను(Israel) మరోసారి తీవ్రస్వరంతో హెచ్చరించింది ఇరాన్(Iran). డ్రోన్ దాడులను(Drone Attacks) ఇజ్రాయెల్ ప్రతీకారంతో చేసినట్టు అయితే తాము అంతకు మించి ప్రతిదాడులు చేస్తామని ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హోస్సేన్ అమిరాబ్డోల్లాహియాన్(Hossein Amirabdollahian) హెచ్చరించారు. శుక్రవారం జరిగిన డ్రోన్ దాడులకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఇజ్రాయెల్‌ను(Israel) మరోసారి తీవ్రస్వరంతో హెచ్చరించింది ఇరాన్(Iran). డ్రోన్ దాడులను(Drone Attacks) ఇజ్రాయెల్ ప్రతీకారంతో చేసినట్టు అయితే తాము అంతకు మించి ప్రతిదాడులు చేస్తామని ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హోస్సేన్ అమిరాబ్డోల్లాహియాన్(Hossein Amirabdollahian) హెచ్చరించారు. శుక్రవారం జరిగిన డ్రోన్ దాడులకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ సిటీ వైమానిక స్థావరం, అణు కార్యక్రమాల ప్రాంతంలోకి చొచుకొచ్చినవి డ్రోన్లు కాదని.. అవి పిల్లలు ఆడుకునే బొమ్మలు అని ఎద్దేవా చేశారాయన! ఈ డ్రోన్ల దాడికి ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపారు. ఈ ఘటనపై ఇరాన్ దర్యాప్తు చేపట్టిందని, డ్రోన్ దాడులకు సంబంధించి మీడియాలో వచ్చే కథనాల్లో స్పష్టత లేదని హోస్సేన్ తెలిపారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రతీకారంగా డ్రోన్ దాడులకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే వెంటనే అంతకు మించి తాము ప్రతిదాడులను చేపడతామని, అలా కాకపోతే తాము ఇక్కడితో ముగిస్తామని హోస్సేన్ అమిరాబ్డోల్లాహియాన్ అన్నారు. ఇస్ఫహాన్ నగర గగనతలంలో చక్కర్లు కొడుతున్న డ్రోన్లను కూల్చేశామని, దాడిని విజయవంతంగా అడ్డుకున్నామని ఇరాన్ ఇంతకు ముందే ప్రకటించింది.