Iran WarningTo Hamas : ఇజ్రాయెల్ భారీ ఉపద్రవాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది ... ఇరాన్ హెచ్చరిక
గాజాలో(Gaza) ఇజ్రాయెల్(Israel) సాగిస్తోన్న భీకర దాడులను ఇరాన్(Iran) మరోసారి తీవ్రంగా ఖండించింది. అమాయక పాలస్తీనియన్లపై దురాక్రమణను వెంటనే ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్‌పై కఠిన చర్యలు తీసుకోడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరబ్దొల్లాహియాన్(Hossein Amir Abdollahian) చెప్పారు.
గాజాలో(Gaza) ఇజ్రాయెల్(Israel) సాగిస్తోన్న భీకర దాడులను ఇరాన్(Iran) మరోసారి తీవ్రంగా ఖండించింది. అమాయక పాలస్తీనియన్లపై దురాక్రమణను వెంటనే ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్‌పై కఠిన చర్యలు తీసుకోడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరబ్దొల్లాహియాన్(Hossein Amir Abdollahian) చెప్పారు. గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణను తక్షణమే ఆపాలని,ఈ ప్రాంతంలోని అన్ని దేశాల చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని హోస్సేన్ గట్టిగా హెచ్చరించారు. హమాస్ దాడులు జరిగిన రోజు నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటిస్తున్న అమెరికాను(America) కూడా ఇరాన్ హెచ్చరించింది. గాజాలో పౌరులపై జరుగుతున్న అనాగరిక దాడులను అడ్డుకోవాలి కానీ ఘర్షణలు మరిన్ని ప్రాతాలకు విస్తరించకుండా చూస్తామని అమెరికా చెప్పడం సరికాదన్నాని హోస్సేన్ అన్నారు. ఇప్పుడు పరిస్థితులను నియంత్రించడం అన్నది ఎవరివల్లా కాదన్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్(Hamas) దాడి వెనుక ఇరాన్ హస్తం ఉండొచ్చన్న అనుమానాలను ఆయన ఖండించారు. గత వారం కూడా ఇరాన్ ఇలాంటి హెచ్చరికలనే చేసింది. ఈ యుద్ధంలో హిజ్బుల్లా కనుక చేరితే ఇతర ప్రాంతాలకు ఇది విస్తరించే అవకాశాలున్నాయి, అప్పుడు ఇజ్రాయెల్ భారీ ఉపద్రవాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.