హాంకాంగ్ లో ఓ మోడల్ దారుణ హత్యకు గురైంది . 28 ఏళ్ల మోడల్ అబ్బి చోయ్ ను అతి దారుణం గా ... ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి హతమార్చారు . తాయ్ పో జిల్లా శివారులోని ఓ ఇంటిలో ఫ్రిడ్జ్‌లో ఆమె కాళ్లు లభించాయి. అక్కడే ఆమెను ముక్కలు చేయడానికి ఉపయోగించిన పరికరాలనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాంకాంగ్‌‌కు చెందిన అబ్బి చోయ్ లోకల్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె ఇటీవలే లోఫిషల్ మొనాకో అనే ఫ్యాషన్ […]

హాంకాంగ్ లో ఓ మోడల్ దారుణ హత్యకు గురైంది . 28 ఏళ్ల మోడల్ అబ్బి చోయ్ ను అతి దారుణం గా ... ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి హతమార్చారు . తాయ్ పో జిల్లా శివారులోని ఓ ఇంటిలో ఫ్రిడ్జ్‌లో ఆమె కాళ్లు లభించాయి. అక్కడే ఆమెను ముక్కలు చేయడానికి ఉపయోగించిన పరికరాలనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హాంకాంగ్‌‌కు చెందిన అబ్బి చోయ్ లోకల్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె ఇటీవలే లోఫిషల్ మొనాకో అనే ఫ్యాషన్ మ్యాగజైన్ డిజిటల్ కవర్ పై కనిపించింది. ఆ తర్వాత లోకల్ టాబ్లాయిడ్‌లలో ఆమె తరుచూ దర్శనం ఇస్తు౦డేది . ఆమె గురువారం నుంచి కనిపించడం లేదు. చివరికి ఆమె విగత జీవై కనిపించింది. తాయ్ పో జిల్లాలో శివారులోని ఓ ఇంటిలోని ఫ్రిడ్జ్‌లో ఆమె రెండు కాళ్లు కనిపించాయి. అలాగే, ఆమె బాడీని వేరు చేయడానికి ఉపయోగించిన టూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు . తల సహా ఇతర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటికి నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ముగ్గురిపై అభియోగాలు ఉన్నాయి. అయితే, వారి పేర్లు వివరాలు మాత్రం ఇంక వెల్లడించలేదు పోలీస్ లు . ఈ ముగ్గురిని కోర్టులో హాజరుపరచబోతున్నట్టు తెలుస్తున్నది.
చోయ్ మాజీ భర్త అలెక్స్ క్వాంగ్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేసినట్టు తెలిపింది. కానీ, అతనిపై అభియోగాలు మోపలేదు. కాగా, ఆమె మాజీ మామా, ఆయన తమ్ముడిపై మర్డర్ అభియోగాలు మోపింది. చోయ్ మాజీ అత్తను కేసు దర్యాప్తులో అడ్డంకులు సృష్టిస్తున్నదని అరెస్టు చేశారు.

Updated On 27 Feb 2023 9:00 AM GMT
Ehatv

Ehatv

Next Story