అమెరికా(USA)లో హోలీ సందడిని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.. అతిశయోక్తి కాదు కానీ అసలు ఈ భూమ్మీద అంత గొప్పగా మరెక్కడా హోలీ వేడుకలు జరగవు! నమ్మి తీరాల్సిన నిజం! అమెరికాలోని ఉతా (utah)లో ఓ పెద్ద ఇస్కాన్‌ టెంపుల్‌ ఉంది.. అక్కడున్న రాధాకృష్ణ (Radha Krishna)మందిరంలో ప్రతి ఏటా రంగుల పండుగ జరుగుతుంటుంది. హోలీ సెలెబ్రెషన్స్‌ కోసమే దాదాపు లక్ష‌లాది మంది అక్కడికి చేరుకుంటారు.. అంతమంది ఒక్కసారి రంగులు చల్లుకోవడం ఓ అద్భుత దృశ్యం. నిర్మలంగా […]

అమెరికా(USA)లో హోలీ సందడిని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.. అతిశయోక్తి కాదు కానీ అసలు ఈ భూమ్మీద అంత గొప్పగా మరెక్కడా హోలీ వేడుకలు జరగవు! నమ్మి తీరాల్సిన నిజం! అమెరికాలోని ఉతా (utah)లో ఓ పెద్ద ఇస్కాన్‌ టెంపుల్‌ ఉంది.. అక్కడున్న రాధాకృష్ణ (Radha Krishna)మందిరంలో ప్రతి ఏటా రంగుల పండుగ జరుగుతుంటుంది. హోలీ సెలెబ్రెషన్స్‌ కోసమే దాదాపు లక్ష‌లాది మంది అక్కడికి చేరుకుంటారు.. అంతమంది ఒక్కసారి రంగులు చల్లుకోవడం ఓ అద్భుత దృశ్యం. నిర్మలంగా ఉండే నీలాకాశం ఒక్కసారిగా రంగులను అద్దుకుంటుంది. వేలాది ఇంద్రధనుస్సులు నేలరాలిపడుతున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ మనలాగ ఏ రంగు పడిదే ఆ రంగు వాడరు. శరీరానికి ఎలాంటి హానీ చేయని రంగులనే ఉపయోగిస్తారు.. ఇలాంటి జాగ్రత్తలన్ని ఆలయ నిర్వాహకులే తీసుకుంటారు. ప్రకృతి సిద్ధమైన రంగులనే ఎక్కువగా వాడతారు. నిజానికి ఇక్కడ సంబరాలు చేసుకునేది భారతీయులు కాదు. అమెరికాకు చెందిన క్రిస్టియన్లు. క్రైస్తవంలో ఒక శాఖగా అవతరించిన మర్మోన్లు (Mormon)ఇక్కడ హోలీని ఘనంగా నిర్వహిస్తారు.

Updated On 7 March 2023 3:12 AM GMT
Ehatv

Ehatv

Next Story