Attack On Temple : కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటు వాదుల ఘాతుకం
కెనడాలో(canada) ఖలిస్థాన్(khalisthan) వేర్పాటువాదులు బరి తెగిస్తున్నారు.
కెనడాలో(canada) ఖలిస్థాన్(khalisthan) వేర్పాటువాదులు బరి తెగిస్తున్నారు. భారతీయులపై(Indian), హిందూ ఆలయాలపై(hindu temple) దాడులకు తెగబడుతున్నారు.ఆదివారం ఒంటారియో రాష్ట్రం బ్రాంప్టన్‌లో ఓ హిందూ ఆలయంపై దాడి చేశారు. ఖలిస్థాన్ జెండాలు పట్టుకుని, ఆలయం ప్రాంగణంలో జరుగుతున్న హిందువుల సభపైకి దూసుకెళ్లారు. అక్కడ ఉన్నవారిని భయభ్రాంతులకు గురిచేశారు. సభకు హాజరైన భక్తులపై దాడి చేశారు. చేయి చేసుకున్నారు. మహిళలను, పిల్లలను కూడా వదలలేదు ఆ దుర్మార్గులు.
ఈ దారుణ ఘటన కెనడాలో తీవ్ర కలకలం రేపింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తో పాటుగా వివిధ రాజకీయ నాయకులు ఘటనను తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షిస్తామని బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ చెప్పారు. కెనడాలోని ప్రతి పౌరుడూ స్వేచ్ఛగా, సురక్షితంగా తన మత విశ్వాసాల్ని పాటించే హక్కు ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇదిలా ఉంటే
బ్రాంప్టన్ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాడులు, వేధింపులతో కెనడాలో భారత దౌత్య అధికారులను బెదిరించలేరంది. కెనడాలో భారత పౌరుల భద్రత, రక్షణ ప్రమాదంలో పడిందని ఆందోళన పడింది. కెనడాలోని హిందూ ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని జస్టిన్ ట్రూడోను కోరింది. మరోవైపు.
బ్రాంప్టన్‌లో హిందూ భక్తులపై దాడి ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. కెనడాలో భారత దౌత్యవేత్తలను బెదిరించడానికి పిరికిపందలు చేసిన ప్రయత్నమని అన్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలతో భారత్ స్థెర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు.