సంథింగ్ బిగ్‌ సూన్‌ ఇండియా(something big Sonn India) అంటూ అమెరికాకు(america) చెందిన షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెనబర్గ్‌ ఓ పోస్ట్‌చేసింది.

సంథింగ్ బిగ్‌ సూన్‌ ఇండియా(something big Sonn India) అంటూ అమెరికాకు(america) చెందిన షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెనబర్గ్‌ ఓ పోస్ట్‌చేసింది. దీంతో భారత్‌లో ఆందోళన నెలకొంది. 2023లో, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గౌతమ్ అదానీకి(Gautham adani) చెందిన అదానీ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ నివేదికను విడుదల చేసింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ అనేక తీవ్రమైన ఆరోపణలు చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్(Hindenburg Research) రిపోర్టు వెలువడిన వెంటనే.. అదానీ గ్రూప్‌లోని అన్ని షేర్లలో భారీగా నష్టపోయాయి.హిండెన్‌బర్గ్‌ రిపోర్టుతో ప్రపంచంలో నంబర్ 2 బిలియనీర్‌గా ఉన్న అదానీ 36వ స్థానానికి దిగజారిపోయారు. లక్షల కోట్ల సంపదలో రికార్డు తగ్గుదల నమోదైంది. కొద్ది రోజుల్లోనే అదానీ గ్రూప్ వాల్యుయేషన్ 86 బిలియన్ డాలర్లు తగ్గిన పరిస్థితి నెలకొంది. షేర్ ధరలో ఈ భారీ పతనం తరువాత సమూహం యొక్క విదేశీ లిస్టెడ్ బాండ్లను భారీగా విక్రయించారు. అయితే తాజాగా ఎక్స్‌లో ఈ సంస్థ మరో పోస్టు చేసింది. ‘సమ్‌థింగ్‌ బిగ్‌ సూన్‌ ఇండియా’ అని రాయడంతో భారత స్టాక్‌ మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి.

Eha Tv

Eha Tv

Next Story