Wife Sharing Tradition : ఇంటికి వచ్చిన అథితులకు 'భార్య'ను గిఫ్ట్‌గా ఇస్తారు
నమీబియాలోని(Namibia) హింబా(Himba) తెగ(Tribe) జాతికి చెందిన 50 వేల మంది ఉంటారు.
నమీబియాలోని(Namibia) హింబా(Himba) తెగ(Tribe) జాతికి చెందిన 50 వేల మంది ఉంటారు. వీరికి సొంత ఇళ్లు ఉన్నప్పటికీ వర్షపాతం లేక నీటి వసతి లేకపోవడంతో మకాం మార్చాల్సి రావడంతో వీరిని సెమీ సంచార జాతులుగా పిలుస్తారు. ఈ తెగలో వింత సాంప్రదాయాలు ఉంటాయి. నమీబియాలోని ఎడారి ప్రాంతాలలో నివసించే హింబా తెగ ప్రత్యేకమైన వైవాహిక, నైతిక నియమాలతో ప్రపంచ సంప్రదాయాలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. హింబా తెగ ప్రజలు తమ భార్యలను సెక్స్ కోసం ఇంటికి వచ్చిన అతిథులకు అత్యున్నతమైన ఆతిథ్యంగా పరిగణిస్తారు. ఇది అతిథులను సాదరంగా స్వాగతించే మార్గమని భావిస్తారు. హింబా తెగల స్త్రీలు చాలా కష్టపడి పనిచేస్తారని చెప్తారు. పురుషుల కంటే స్త్రీలు చాలా ఎక్కువ పని చేస్తారు. జంతువులు, గృహాల సంరక్షణ, వంట చేయడం, శుభ్రపరచడం, పిల్లలను చూసుకోవడం వంటి ఇంటి పనులు ఉంటాయి. హింబా తెగలోని పురుషులు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటం సర్వసాధారణం. హింబా తెగకు కూడా భార్యల మార్పిడి సంప్రదాయం ఉందని, ఇది శతాబ్దాలుగా కొనసాగుతోందని ఓ డాక్యుమెంటరీ పేర్కొంది. పురుషులు తమ భార్యలను తెలియని పురుషులతో రాత్రి గడపడానికి అనుమతిస్తారు