కేంద్రంలో బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్‌డిఎ(NDA) ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసుకొస్తున్న కొత్త నిబంధనలతో కోటీశ్వరులు విసుగెత్తిపోతున్నారు.

కేంద్రంలో బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్‌డిఎ(NDA) ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసుకొస్తున్న కొత్త నిబంధనలతో కోటీశ్వరులు విసుగెత్తిపోతున్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టి, కంపెనీలు స్థాపించి వందలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన డబ్బున్న వ్యాపారులంతా దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది ఈ విధంగా 4,300 మంది మిలియనీర్లు భారత్‌ను వదిలేసి వెళ్లిబోతున్నారు. మిలియనీర్ల వలసలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో చైనా(china), బ్రిటన్‌(Britain) తర్వాత స్థానం భారత్‌దే(India) కావడం గమనార్హం. నరేంద్ర మోదీ(Narendra modi) పభుత్వం అమలు చేస్తున్న ఏకపక్ష విధానాలు మిలియనీర్లకు నచ్చడంలేదు. మాతృదేశం కోసం ఏదైనా చేయాలన్న వారి ఆశయాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని హెన్లీ అండ్ పార్టనర్స్‌(Henly and Patrners) నివేదిక చెబుతోంది. దేశంలో ఆర్థిక పరిస్థితులు, పన్నులు, వ్యాపార అవకాశాలు, సంతానానికి విద్యావకాశాలు, అందుబాటులో వైద్యం, మెరుగైన జీవన ప్రమాణాలను బేరీజు వేసుకున్న తర్వాతే సంపన్న వ్యాపారులు దేశం వదిలివెళ్లిపోతున్నారని హెన్లీ రిపోర్ట్‌ అంటోంది. గడచిన మూడేళ్లలో ఇలా వలస వెళ్లిన వాళ్లు 18 వేలకు పైగానే ఉంటారు. వారిలో ఒక్కొక్కరు కనీసం 8.2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవాళ్లని అనుకున్నా ఈ మూడేళ్లలో దేశ ఆర్ధిక వ్యవస్థ 1,50,060 కోట్ల రూపాయలను నష్టపోయిందనుకోవాలి. ఇలా వలస వెళుతున్నవారు ఎమిరేట్స్‌కో అమెరికాకో వెళుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story