అగ్రరాజ్యం అమెరికాను(America) భారీ వర్షాలు(Heavy Rains), వరదలు(Floods) వణికిస్తున్నాయి. న్యూయార్క్‌(Newyork) నగరంలో భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవితం అస్తవ్యస్తమయ్యింది. వరదలు సంభవించాయి. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు.

అగ్రరాజ్యం అమెరికాను(America) భారీ వర్షాలు(Heavy Rains), వరదలు(Floods) వణికిస్తున్నాయి. న్యూయార్క్‌(Newyork) నగరంలో భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవితం అస్తవ్యస్తమయ్యింది. వరదలు సంభవించాయి. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. ప్రభుత్వం ఎమర్జెన్సీని(Emergency) ప్రకటించింది. న్యూయార్క్‌లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు, సబ్‌వేలు జలమయమయ్యాయి. వరదల దృష్ట్యా న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. న్యూయార్క్, న్యూజెర్సీ(New Jersy), పెన్సిల్వేనియాతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Updated On 30 Sep 2023 6:49 AM GMT
Ehatv

Ehatv

Next Story