Heart Stopped for 45 Minutes:ముప్పావు గంట సేపు ఆగిన గుండె, ఆమె చావును జయించింది!
అమెరికాలో ఒక అద్భుతం జరిగింది సంఘటన జరిగింది.
అమెరికాలో ఒక అద్భుతం జరిగింది సంఘటన జరిగింది. ఒక విచిత్రం చోటు చేసుకుంది . 45 నిమిషాల పాటు ఆగిన గుండె మళ్ళీ కొట్టుకుంది. నిలిచిపోయిన ఊపిరి తిరిగి తీసుకుని ఒక మహిళ చావును జయించింది. మృత్యుంజయురాలిగా నిలిచింది.
టెక్నాస్‌లోని హ్యూస్టన్‌కు చెందిన మారిసా క్రిస్టీ అనే మహిళ ఆగస్టు 21వ తేదీన విడ్లాండ్స్ మెడికల్ సెంటర్లో సీ-సెక్షన్ ద్వారా ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. స్పృహ కోల్పోయింది. ఆమె గుండె ఆగిపోయింది. ఊపిరి కూడా నిలిచిపోయింది. ఇది గమనించిన డాక్టర్లు. వెంటనే సీపీఆర్ ప్రారంభించారు. యంత్రం ద్వారా కృత్రిమంగా రక్తాన్ని పంపింగ్ చేశారు. వైద్యులు కృషి ఫలించింది. 45 నిమిషాల తర్వాత మళ్లీ ఆమె గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. వారం పాటు ఎక్మోపైన చికిత్స అందించిన తర్వాత పూర్తిగా కోలుకున్నది. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజం అనే అరుదైన, ప్రాణాంతక సమస్య కారణంగానే క్రిస్టీకి ఈ పరిస్థితి వచ్చినట్టు వైద్యులు అంటున్నారు.