Hardik Pandya : అగ్రస్థానానికి హార్థిక్ పాండ్య
టి-20 ప్రపంచ్ కప్(T20 worldcup) గెలిచేందుకు ముఖ్య భూమిక పోషించిన హార్థిక్ పాండ్యాకు(Hardik Pandey) ఐసీసీ ఆల్‌రౌండర్ల జాబితాలో నెం.1 ర్యాంక్ దక్కింది.
టి-20 ప్రపంచ్ కప్(T20 worldcup) గెలిచేందుకు ముఖ్య భూమిక పోషించిన హార్థిక్ పాండ్యాకు(Hardik Pandey) ఐసీసీ ఆల్‌రౌండర్ల జాబితాలో నెం.1 ర్యాంక్ దక్కింది. ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన హార్థిక్ పాండ్య రెండు పాయింట్లు ఎగబాకాడు. శ్రీలంక ఆటగాడు వానిందు హసరంగాతో కలిసి హార్థిక్ సంయుక్తంగా తొలి స్థానాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలోనే టి20ల్లో ఆల్‌రౌండర్ల కేటగిరిలో నెంబర్‌వన్‌గా నిలిచిన తొలి భారత క్రికెటర్‌గా(Allrounder cricketer) కూడా హార్థిక్ రికార్డ్ సృష్టించాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టాయినిస్, జింబాబ్వే ఆటగాడు రజా, బంగ్లాదేశ్ క్రీడాకారుడు షకిబ్ అల్ హసన్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఆఫ్గనిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ నాలుగు స్థానాలు దిగిజారి ఆరో స్థానానికి పడిపోయాడు.
ఇక ప్రపంచకప్‌లో హార్థిక్ ప్రదర్శనకు వస్తే ఆరు ఇన్నింగ్స్‌ల్లో 144 పరుగులు చేసి 151.57 స్ట్రైక్ రేట్ సాధించాడు. ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. 8 మ్యాచుల్లో 7.64 ఎకానమీ రేటుతో 11 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి జట్టుకు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో టీమిండియా గెలిచిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు పాండ్యా.
ఇక బౌలింగ్ విభాగంలో ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచిన బూమ్రా ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 12వ స్థానంలో నిలిచాడు. 2020 తర్వాత బూమ్రాకు ఇదే బెస్ట్ ర్యాంక్. ఈ ప్రపంచ కప్‌లో 17 వికెట్లు పడగొట్టి అర్షదీప్ నాలుగు స్థానాలు ఎగబాకి 13వ స్థానం దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ ఏడో స్థానంలో, కులదీప్‌యాదవ్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా పేసర్ అన్నిచ్ నోకియా ఏడు స్థానాలు ఎగబాకి రెండో స్థానం సాధించాడు