Hamas Deal With Israel : దాడులను తక్షణమే ఆపండి.. బందీలను వదిలిపెడతాం
హమాస్(Hamas)పై కాకుండా పాలస్తీనాపై(Palestine) యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్(Israel). గాజా ఆసుప్రతి(Gaza Hospital)పై దాడి చేసి వందలాది మంది అమాయకులను పొట్టనపెట్టుకుంది. ఆసుపత్రిలో ఉన్న వేలాది మంది గాయాలపాలయ్యారు. గాజా నగరం క్షతగాత్రుల ఆర్తనాదాలతో ప్రతిధ్వనిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఉత్తర గాజాలో ఉంటున్న ప్రజలలో సగానికి సగం నగరాన్ని వదిలేసి వెళ్లిపోయారు. దాడులలో హమాస్ టాప్ కమాండర్ చనిపోయారు.
హమాస్(Hamas)పై కాకుండా పాలస్తీనాపై(Palestine) యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్(Israel). గాజా ఆసుప్రతి(Gaza Hospital)పై దాడి చేసి వందలాది మంది అమాయకులను పొట్టనపెట్టుకుంది. ఆసుపత్రిలో ఉన్న వేలాది మంది గాయాలపాలయ్యారు. గాజా నగరం క్షతగాత్రుల ఆర్తనాదాలతో ప్రతిధ్వనిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఉత్తర గాజాలో ఉంటున్న ప్రజలలో సగానికి సగం నగరాన్ని వదిలేసి వెళ్లిపోయారు. దాడులలో హమాస్ టాప్ కమాండర్ చనిపోయారు. ఈ క్రమంలోనే హమాస్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఇజ్రాయెల్ దాడులను నిలిపివేస్తే తమ దగ్గర ఉన్న ఇజ్రాయెలీ బందీలను(Israel Hostages) వదిలేస్తామని హమాస్ తెలిపింది. మరోవైపు హమాస్ దళాలకు చెందిన రాకెట్ దాడుల్లోనే ఆసుపత్రి కూలిపోయిందని ఇజ్రాయెల్ చెబుతోంది. మంగళవారం ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ దాడులు జరిపిందని, అందులో విఫలమైన ఓ రాకెట్ ఆస్పత్రిపై పడిందని, తమ బలగాలు ఆ ఆస్పత్రిపై రాకెట్‌ను ప్రయోగించలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది. ఆసుపత్రిపై జరిగిన దాడిని పాలస్తీనా అధికారులు ఊచకోతగా పేర్కొన్నారు. గాజాలో ఆసుపత్రిపై వైమానిక దాడిలో వందలాది మంది మరణించడంతో మూడు రోజుల సంతాప దినాలను పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రకటించారు.