గాజా(Gaza)పై ఇజ్రాయెల్‌(Israel) జరిపిన వైమానిక దాడులలో హమాస్‌(Hamas) చేతిలో బందీలుగా ఉన్నవారు మరణించారు. ఈ విషయాన్ని హమాస్‌ సంస్థే స్వయంగా ప్రకటించింది. గత 24 గంటల్లో గాజా స్ట్రిప్‌ నార్త్‌ భాగంలో ఇజ్రాయెల్‌ బలగాలు జరిపిన దాడుల్లో 13 మంది బందీలు మృతి చెందారని హమాస్‌ తెలిపింది.

గాజా(Gaza)పై ఇజ్రాయెల్‌(Israel) జరిపిన వైమానిక దాడులలో హమాస్‌(Hamas) చేతిలో బందీలుగా ఉన్నవారు మరణించారు. ఈ విషయాన్ని హమాస్‌ సంస్థే స్వయంగా ప్రకటించింది. గత 24 గంటల్లో గాజా స్ట్రిప్‌ నార్త్‌ భాగంలో ఇజ్రాయెల్‌ బలగాలు జరిపిన దాడుల్లో 13 మంది బందీలు మృతి చెందారని హమాస్‌ తెలిపింది. మొత్తం అయిదు ప్రాంతాలలో 13 మంది చనిపోయారని, మృతి చెందిన వారిలో ఇజ్రాయెల్ పౌరులతో పాటు బందీలుగా ఉన్న విదేశీలు కూడా ఉన్నారని హమాస్‌ తెలిపింది. సుమారు పాతిక లక్షల జనాభా ఉన్న గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడుతోంది. బాంబులు, క్షిపణులతో దాడులు చేస్తోంది. రాకెట్‌ దాడుల్లో భవంతులు నేలకూలుతున్నాయి. ఇప్పటివరకు గాజాలో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 15 వందల మంది చనిపోయారు. గాజా ప్రజలను లక్ష్యంగా పెట్టుకుని దాడులకు దిగితే మాత్రం ప్రతిగా బందీలను చంపేస్తామంటూ హమాస్‌ ఇప్పటికే ప్రకటించింది. అయినా ఇజ్రాయెల్‌ లెక్క చేయడం లేదు. గాజాకు నీరు, కరెంట్‌ సరఫరా నిలిపివేసింది.

Updated On 13 Oct 2023 5:25 AM GMT
Ehatv

Ehatv

Next Story