Gunther VI : కుక్క మనకంటే చాలా బెటర్.. ప్రపంచంలోనే సంపన్నమైన కుక్క
ఒక కుక్కకు(Dog) ఎంత సంపద(Wealth) ఉందో చెప్తే మీరు ముక్కున వేలేసేకుంటారు.
ఒక కుక్కకు(Dog) ఎంత సంపద(Wealth) ఉందో చెప్తే మీరు ముక్కున వేలేసేకుంటారు. ఆ కుక్కకు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.3 వేల 3 వందల కోట్ల సంపద ఉందంటే మీరు నమ్మక తప్పదు. ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన కుక్క. దానికి ఒక ప్రైవేట్ జెట్(Private jet), పడవ(Private Yatch), ఇతర ఖరీదైన వస్తువులు ఉన్నాయి. 'గున్థర్ VI'(Gunther VI) అనే కుక్క జర్మన్ షెపర్డ్(German sheshard) జాతికి చెందినది. రూ. 3,300 కోట్లకుపైగా సంపద కలిగి ఉండి గుంథర్ VI చాలా మంది బిలియనీర్లతో పోటీ పడుతున్నాడు. అయితే ఇంత సంపాదన ఈ కుక్కకు ఎలా వచ్చిందని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా.. స్టోరీ చూద్దాం
1992లో, కార్లోట్టా లీబెన్‌స్టెయిన్ అనే పేరుగల కౌంటెస్, తన కొడుకును కోల్పోయిన తర్వాత తన ప్రియమైన కుక్క 'గున్థర్ IIIకి' గణనీయమైన $80 మిలియన్లను ఆస్తులను ఇచ్చారు. దీనిని సంరక్షించే బాధ్యతను ఇటాలియన్ స్నేహితుడు మౌరిజియో మియాన్‌కు అప్పజెప్పారు, అతను గున్థర్ ట్రస్ట్ ద్వారా ఆ ఆస్తిని $400 మిలియన్లకు విస్తరించాడు. గున్థర్ VI అసమానమైన, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. దీనికి సేవలు చేసేందుకు 27 మంది ఉద్యోగులున్నారు. ఇది తినేందుకు ఆహారాన్ని తయారు చేయడానికి ఒక ప్రైవేట్ చెఫ్ ఉన్నాడు. గున్థర్ VI ఆస్తులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి, మడోన్నా యొక్క మాజీ మయామి భవనంతో సహా అనేక రకాల ఆస్తులున్నాయి. విదేశీ ప్రయాణాలు చేయాలంటే ఈ కుక్కకు ప్రైవేట్ జెట్ ఉపయోగిస్తారు. ఖరీదైన ఆహారాన్ని దీనికి అందిస్తారు.