Moscow Firing : రష్యాలో ఉగ్రమూకల కాల్పులు.. 60 మంది దుర్మరణం
రష్యా రాజధాని మాస్కో శుక్రవారం ఉగ్రదాడితో దద్దరిల్లింది. నలుగురైదుగురు గుర్తుతెలియని ముష్కరులు రద్దీగా ఉండే క్రాకస్ సిటీ సంగీత కచేరీ హాలులోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
రష్యా రాజధాని మాస్కో శుక్రవారం ఉగ్రదాడితో దద్దరిల్లింది. నలుగురైదుగురు గుర్తుతెలియని ముష్కరులు రద్దీగా ఉండే క్రాకస్ సిటీ సంగీత కచేరీ హాలులోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 60 మంది మరణించగా 145 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) బాధ్యత వహించింది. దీనికి సంబంధించిన పోస్ట్‌ను ఐఎస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను పేల్చడంతో అక్కడ మంటలు చెలరేగాయి. దాడి అనంతరం ప్రత్యేక పోలీసు బలగాలు సహాయకచర్యలు చేపట్టాయి. మీడియా నివేదికల ప్రకారం.. ముగ్గురు నుండి నలుగురు ముష్కరులు ఒకేసారి జనాలపై కాల్పులు జరపడం ప్రారంభించారు. అలర్టైన పోలీసు బృందాలు ప్రజలను ఖాళీ చేయించి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే పనిలో నిమగ్నమయ్యారు. కాల్పుల అనంతరం సుమారు 100 మంది థియేటర్ బేస్‌మెంట్ నుండి తప్పించుకోగలిగారని, మరికొందరు పైకప్పుపై దాక్కున్నారని అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ తెలిపింది. రాక్ బ్యాండ్ సభ్యులందరినీ సురక్షితంగా తరలించినట్లు ప్రకటన పేర్కొంది.