ప్రపంచంలోని ఏడు వింతల్లో గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా(Great Wall Of China) ఒకటి. ఆ మహా కుడ్యం ఆ దేశానికి ఎంతో గుర్తింపు తెచ్చింది. టూరిస్టులను పెంచుతోంది. ఆ గోడ ఓ విధంగా ఆ దేశానికి ప్రహారిలాంటిది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన మొదటి చారిత్రాత్మక కట్టడం(Historical construction) అది. అలాంటి నిర్మాణాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? కానీ ఇద్దరు వ్యక్తులు అలా అనిపించలేదు.

ప్రపంచంలోని ఏడు వింతల్లో గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా(Great Wall Of China) ఒకటి. ఆ మహా కుడ్యం ఆ దేశానికి ఎంతో గుర్తింపు తెచ్చింది. టూరిస్టులను పెంచుతోంది. ఆ గోడ ఓ విధంగా ఆ దేశానికి ప్రహారిలాంటిది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన మొదటి చారిత్రాత్మక కట్టడం(Historical construction) అది. అలాంటి నిర్మాణాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? కానీ ఇద్దరు వ్యక్తులు అలా అనిపించలేదు. గోడకు ఏర్పడిన చిన్న సందుకు మరమత్తులు చేయకుండా రాకపోకలకు అడ్డంగా ఉందని దానిని పెద్దది చేసే ప్రయత్నం చేశారు. మొత్తంగా గోడను కొంత వరకు కూల్చేశారు. ఈ ఘటన ఉత్తర షాక్సీ(North Shaxi) ప్రావిన్స్‌లోని యూయు కౌంటీలో(UU County) ఉన్న యాంగ్‌క్యాన్హె టౌన్‌షిప్‌ దగ్గర జరిగింది. ఇక్కడికి దగ్గరలో ఉన్న ఓ నిర్మాణ కాంట్రాక్టును ఓ 55 ఏళ్ల మహిళ, 38 ఏళ్ల వ్యక్తి తీసుకున్నారు. అయితే వారి రాకపోకలకు ఈ గోడ అడ్డంకిగామారింది. యంత్ర సామాగ్రిని నిర్మాణ స్థలానికి చేర్చడానికి గ్రేట్ వాల్‌ అడ్డుగా ఉంది.

ఈ కారణంగా వారు పని చేసే చోటుకు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. ఇది వారికి కష్టంగా అనిపించింది. గ్రేట్‌వాల్ కూల్చేస్తే చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది కదా అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా యంత్రాలసాయంతో గోడను కొంతవరకు కూల్చేశారు. ఇది స్థానికులకు కోపం తెప్పించింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలికి వచ్చి కూల్చేసిన గోడను చూసి ఆశ్చర్యపోయారు. షార్ట కట్‌ కోసం ఆ దేశ ప్రతిష్టకు ప్రతీకగా నిల్చిన గోడనే కూల్చేశారంటే వీరు మామూలోళ్లు కాదని అనుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. గ్రేట్ వాల్‌ ఆఫ్‌ చైనా నిర్మాణం క్రీస్తుపూర్వం 200లోనే మొదలయ్యింది. అనేక రాజ వంశీయులు ఈ గోడ నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. ఇప్పుడున్న కట్టడాన్ని 1368-1644 మధ్యలో మింగ్‌ వంశీయులు నిర్మించారు. ఈ మహా కుడ్యాన్ని యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించింది.

Updated On 7 Sep 2023 4:58 AM GMT
Ehatv

Ehatv

Next Story