కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అమెరికా సందర్భంగా మంగళవారం శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. ఈ సందర్భంగా కాలిఫోర్నియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రను ఆపడానికి ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించిందని అన్నారు.

కాంగ్రెస్(Congress) అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అమెరికా ప‌ర్య‌ట‌న‌ సందర్భంగా మంగళవారం శాన్ ఫ్రాన్సిస్కో(San Francisco) చేరుకున్నారు. ఈ సందర్భంగా కాలిఫోర్నియా యూనివర్సిటీ(University of California)లో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)ను ఆపడానికి ప్ర‌ధాని మోదీ(PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించిందని అన్నారు. భారత్ జోడో అనే ఆలోచన అందరి హృదయాల్లో ఉంది కాబట్టి.. దాని ప్రభావం పెరుగుతోందని అన్నారు. బీజేపీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని, ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలతో మమేకం కావడానికి ప్రారంభమైన‌ భారత్ జోడో యాత్రకు అవసరమైన అన్ని మార్గాలను బీజేపీ-ఆర్ఎస్ఎస్(BJP-RSS) లు నియంత్రించాయని ఆరోపించారు.

అంతకుముందు రాహుల్ గాంధీకి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా(Sam Pitroda), ఇతర కాంగ్రెస్‌ సభ్యులు విమానాశ్రయం(Airport)లో స్వాగతం పలికారు. రాహుల్ తన వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే న్యూయార్క్‌లోని వాల్ స్ట్రీట్ ఎగ్జిక్యూటివ్‌లు, విశ్వవిద్యాలయ విద్యార్థులతో సంభాషించనున్నారు. జూన్ 4న పర్యటన ముగింపుకు ముందు న్యూయార్క్‌(Newyork)లో జరిగే బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు.

Updated On 30 May 2023 11:48 PM GMT
Yagnik

Yagnik

Next Story