Monkey Pox : ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వైరస్
కరోనా వైరస్(Corona Virus) నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటోంది.
కరోనా వైరస్(Corona Virus) నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటోంది. కరోనా సోకినవారిలో పలు అనారోగ్య సమస్యల వస్తున్నాయని ఇప్పటికీ వింటున్నాం. ఎంత మంది ప్రాణాలను బలిగొందో, ఎంత మందిని అనాథలుగా మార్చిందో చూశాం. అయితే ఇప్పుడు కోవిడ్ తర్వాత మరో వైరస్ మానవాళిని భయపెడుతోంది. ఆఫ్రికా దేశమైన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎంపాక్స్(Mpox Virus) అనే వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే 12కుపైగా దేశాల్లో పెద్దలతోపాటు చిన్నారుల్లోనూ ఎంపాక్స్ వైరస్ కేసులను గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని(emergency) ప్రకటించింది. రెండేళ్ల ఇది రెండోసారి డబ్ల్యూహెచ్‌వో ఎంపాక్స్ వైరస్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. గతంలో మంకీ పాక్స్(Monkey Pox) అని పిలిచిన ఎంపాక్స్ కేసులు ప్రమాదకర రీతిలో పెరుగుతుండటంతో ఈ మధ్యనే ఆఫ్రికా సీడీసీ కూడా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ ఏడాది ఆఫ్రికాలో ఇప్పటి వరకు 17 వేలకుపైగా అనుమానిత ఎంపాక్స్ కేసులతోపాటు 517 మరణాలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 167 శాతం అధికమని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. 13 దేశాల్లో ఎంపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. కరోనా వైరస్‌ను తొలుత డబ్ల్యూహెచ్‌వో అంతగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో విమర్శలకు గురయింది. అందుకే ఇప్పుడు ముందు జాగ్రత్తగా ఈ ఎంపాక్స్‌పై ముందుగానే హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ ఎంపాక్స్‌పై మొదటి సారి మెడికల్ ఎమెర్జెనీని డబ్ల్యూహెచ్వో జారీ చేయలేదు. కానీ ఈ వైరస్‌పై ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.