తండ్రికి వచ్చే పెన్షన్‌ కోసం ఓ కూతురు దారుణానికి ఒడిగట్టింది. పింఛన్‌ డబ్బుల(pension money) కోసం తండ్రి మృతదేహాన్ని(Dead body) ఇంట్లోనే కొన్నేళ్ల పాటు దాచి పెట్టింది. తైవాన్‌లో(Taiwan) వెలుగుచూసిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె తండ్రి రెండు దశాబ్దాల పాటు సైన్యంలో(Military) పని చేసి రిటైరయ్యాడు. ఆయన హోదా, సర్వీసు బట్టి నెలకు దాదాపు 1.27 లక్షల రూపాయల పెన్షన్‌ వస్తుంది. నెలకు ఠంచన్‌గా పింఛన్‌ పడటం, దాన్ని విత్‌డ్రా చేసుకోవడం జరుగుతున్నదే కానీ ఆ వృద్ధుడు మాత్రం కనిపించలేదు.

తండ్రికి వచ్చే పెన్షన్‌ కోసం ఓ కూతురు దారుణానికి ఒడిగట్టింది. పింఛన్‌ డబ్బుల(pension money) కోసం తండ్రి మృతదేహాన్ని(Dead body) ఇంట్లోనే కొన్నేళ్ల పాటు దాచి పెట్టింది. తైవాన్‌లో(Taiwan) వెలుగుచూసిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె తండ్రి రెండు దశాబ్దాల పాటు సైన్యంలో(Military) పని చేసి రిటైరయ్యాడు. ఆయన హోదా, సర్వీసు బట్టి నెలకు దాదాపు 1.27 లక్షల రూపాయల పెన్షన్‌ వస్తుంది. నెలకు ఠంచన్‌గా పింఛన్‌ పడటం, దాన్ని విత్‌డ్రా చేసుకోవడం జరుగుతున్నదే కానీ ఆ వృద్ధుడు మాత్రం కనిపించలేదు. కూతురు తీరు కూడా అనుమానస్పదంగా ఉండటంతో అధికారులు డౌట్‌ వచ్చింది. డెంగీ నివారణ చర్యల్లో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగినప్పుడు కూడా ఆమె వారిని ఇంట్లోకి రానివ్వలేదు. అప్పుడామెకు లక్షన్నర రూపాయల జరిమానా విధించారు. ఇలాగే మరోసారి కూడా ప్రభుత్వ ఉద్యోగులను ఇంట్లోకి రానివ్వలేదు. దాంతో అధికారులకు అనుమానం వచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి తండ్రి ఆచూకి చెప్పమన్నారు. మొదట నర్సింగ్‌హోమ్‌లో ఉన్నాడని చెప్పింది. గట్టిగా నిలదీసేసరికి వేరే నగరంలో ఉన్న తన సోదరుడి దగ్గర ఉన్నాడని తెలిపింది. ఆమె సోదరుడు చనిపోయి చాన్నాళ్లయ్యిందని పోలీసు విచారణలో తేలింది. ఇదే విషయాన్ని ఆమెతో చెప్పినప్పుడు, తండ్రి చనిపోయాడని, డెత్‌ సర్టిఫికెట్‌ తనకు రాలేదని చెప్పింది. ఇలా తడవతడవకో కథ చెబుతుండటంతో పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు చేశారు. దాంతో అసలు విషయం బయటపడింది. ఓ ప్లాస్టిక్‌ బ్యాగులో మానవ ఎముకలు దొరికాయి. వాటిని ల్యాబ్‌కు పంపించారు. రెండేళ్ల కిందటే ఆయన చనిపోయి ఉంటాడని తేలింది. అయితే ఆ వృద్ధుడు ఎలా చనిపోయాడన్నది మాత్రం తెలియలేదు. కూతురే చంపి ఉండవచ్చన్నది పోలీసుల అనుమానం.

Updated On 13 May 2024 4:23 AM GMT
Ehatv

Ehatv

Next Story