జర్మనీ చర్చిలో నిన్న రాత్రి మారణకాండ జరిగింది . గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు కొంతమంది అమాయకులు. గురువారం రాత్రి హాంబర్గ్ లో ఉన్న చర్చి లో కొంతమంది అకస్మాతుగా కాల్పులు జరిపారు

జర్మనీ చర్చిలో నిన్న రాత్రి మారణకాండ జరిగింది . గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు కొంతమంది అమాయకులు. గురువారం రాత్రి హాంబర్గ్ లో ఉన్న చర్చి లో కొంతమంది అకస్మాతుగా కాల్పులు జరిపారు . మూడుఅంతస్తుల చర్చి భవనం లో మొదటి ఫ్లోర్ నుండి తుపాకీ పేలిన శబ్దం వచ్చిందని పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అంచనా వేయటం జరిగింది.

గత రాత్రి అనూహ్య పరిణామంలో జరిగిన ఈ కాల్పుల్లో పలువురు మృతిచెందగా కొంత మంది తీవ్ర గాయాల పాలు అవ్వటం తో హుటాహుటిన ఆసుపత్రిలో జాయిన్ చేయటం జరిగింది . కింది ఫ్లోర్ లో సేవలు రక్తపుమడుగులో చల్ల చెదురుగా పడిఉండగా . మొదటి ఫ్ల్లోర్ లో లభించిన ఒక మృతదేహం ని చూసి కాల్పులు జరిపిన వ్యక్తి గా అంచనా వేస్తున్నారు . కాల్పులు జరిపిన అనంతరం ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చు అన్న అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు పోలీసులు .

కాల్పులు జరిపింది ఎవరు అనేదాని మీద స్పష్టత పూర్తిగా లేదు . ఏది ఏమైనా ఉగ్రవాదాచార్య అనేకోణంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతం లో జర్మని లో ఎలాంటి దాడులు జరిగాయి . 2016 డిసెంబర్ లో బెర్లిన్ క్రిస్మస్ మార్కెట్లో ఐసియస్ ఉగ్రవాదుల దడి లో 12 మంది మరణించారు . ఫిబ్రవరి 2020 హనౌ లో అతివాద సంస్థ వ్యక్తి జరిపిన కాల్పులూ 10 మంది దుర్మరణం చెందారు . ప్రస్తుత జరిగిన మారణకాండకు ఎవరు కారణం అనేది తెలియకపోయిన,స్థానికులను ఇళ్ల నుండి బయటకు రాకూడదు అనే హెచ్చరికను జారీచేయటం జరిగింది .

Updated On 10 March 2023 4:18 AM GMT
Ehatv

Ehatv

Next Story