ఓ ప్రత్యేకమైన కండోమ్ యాప్ మార్కెట్లోకి వచ్చింది. ఈ యాప్‌ను జర్మనీలో లాంచ్‌ చేశారు.

ఓ ప్రత్యేకమైన కండోమ్ యాప్ మార్కెట్లోకి వచ్చింది. ఈ యాప్‌ను జర్మనీ(Germany)లో లాంచ్‌ చేశారు. దీనిని డిజిటల్ కండోమ్ యాప్(Digital Condom App) లేదా కామ్‌డమ్ అని అంటారు. వ్యక్తుల ప్రైవసీని కాపడడంలో ఇది చాలా ఉపయోగపడుతుందని యాప్‌ నిర్వాహకులు వెల్లడించారు. ఈ యాప్ ఇతరులతో గడుపుతున్న సమయంలో ఈ యాప్‌ స్మార్ట్‌ఫోన్ కెమెరాను డిజేబుల్‌ చేస్తుంది. తద్వారా అనుమతి లేకుండా వీడియో లేదా ఆడియో రికార్డింగ్ చేయలేరు. ఈ డిజిటల్ కండోమ్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. ఈ రోజుల్లో మన ఫోన్‌లలో మన వ్యక్తిగత డేటా చాలా వరకు ఉంటుదని. అటువంటి పరిస్థితిలో, మన వ్యక్తిగత సంభాషణలను అనుమతి లేకుండా రికార్డ్ చేయకుండా రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఈ ఉద్దేశంతో యాప్‌ను తయారు చేశామని వెల్లడించారు.

ఈ యాప్‌ను ఉపయోగించడానికి, వినియోగదారులు ముందుగా ఓపెన్‌ చేసి వర్చువల్ బటన్‌ను స్వైప్ చేయాలి. ఇలా చేయడం ద్వారా, ఫోన్ మైక్రోఫోన్, కెమెరా ఆఫ్ చేయబడతాయి. ఈ ప్రక్రియ చాలా సులభం మరియు ఎవరైనా సులభంగా చేయవచ్చు. మీ భాగస్వామి కెమెరాను ఆన్ చేయడానికి ప్రయత్నిస్తే, ఈ యాప్ వెంటనే వార్నింగ్‌ ఇస్తుంది. మీ భాగస్వామి కెమెరాను ఆన్ చేయడానికి ప్రయత్నిస్తే, ఈ యాప్ వెంటనే హెచ్చరిస్తూ అలారం మోగిస్తుంది. దీంతో మీ అనుమతిలేకుండా మీ భాగస్వామి రికార్డు చేస్తున్నట్లు తెలిసిపోతుంది. ఈ యాప్ డిజిటల్‌గా ప్రైవసీని కాపాడుతుంది. ఈ యాప్ 30కి పైగా దేశాల్లో వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం, ఈ యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది, అయితే ఇది రాబోయే రోజుల్లో iOS పరికరాల్లో కూడా ప్రారంభిస్తారు.

ehatv

ehatv

Next Story