ఇజ్రాయెల్‌(Israel)-హమాస్‌(Hama) మధ్య యుద్ధం మొదలయ్యి మూడు వారాలవుతోంది. రోజురోజుకీ యుద్ధ తీవ్రత పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. గాజాలో(Gaza) అమాయక ప్రజలు, పసిపిల్లలు, మహిళలు చనిపోతున్నా ప్రపంచదేశాలు ఇటువైపు కన్నేత్తి కూడా చూడటం లేదు.

ఇజ్రాయెల్‌(Israel)-హమాస్‌(Hama) మధ్య యుద్ధం మొదలయ్యి మూడు వారాలవుతోంది. రోజురోజుకీ యుద్ధ తీవ్రత పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. గాజాలో(Gaza) అమాయక ప్రజలు, పసిపిల్లలు, మహిళలు చనిపోతున్నా ప్రపంచదేశాలు ఇటువైపు కన్నేత్తి కూడా చూడటం లేదు. హమాస్‌ను నామరూపాలు చేస్తామని, అందుకోసం గాజాను సర్వనాశనం చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని అంటున్న ఇజ్రాయెల్ ఆ వంకతో పాలస్తీనా(Palestine) ప్రజలను చంపేస్తోంది. ఇప్పటికే తమ దళాలకు గాజాపై భూతల దాడికి సిగ్నల్స్ ఇచ్చింది.

అమెరికా అండదండలు, ఐక్యరాజ్యసమితి మిన్నకుండటంతో ఇజ్రాయెల్‌ రెచ్చిపోతున్నది. ఇజ్రాయెల్‌ దాడులలో ఇప్పటి వరకు ఏడు వేల మందికిపై ప్రజలు చనిపోయినట్టు గాజాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ చెబుతోంది. విషాదమేమిటంటే ఇందులో మూడు వేల మంది చిన్నారులు ఉండటం. గాజాలో పరిస్థితులను చూస్తే కడుపు దేవుతోంది. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన మృతదేహాలు చూస్తే గుండుల్లో కలుక్కుమంటోంది. హృదయం ద్రవిస్తోంది. ఆత్మీయులు చనిపోయారని తెలిసినా ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు.

శవాల గుర్తింపు కోసం బయటకు వస్తే ఎక్కడ ప్రాణాలు పోతాయేమోనన్న భయం. గాజాలో ఇప్పటికే 19 మంది జర్నలిస్టులు(Journalist) చనిపోయారు. వారి కుటుంబాలను కూడా ఇజ్రాయెల్‌ సైన్యం మట్టుపెట్టింది. చాలా మంది ఆత్మీయులను జర్నలిస్టులో కోల్పోయారు. వారి రోదనలు ఎవరికీ పట్టడం లేదు. ప్రధానమంత్రి నెతన్యహూ వ్యవహరిస్తున్న దుర్మార్గపు వైఖరి కారణంగా బందీలే బలైపోతున్నారు. ఏ బందీలనైతే సురక్షితంగా విడిపించాలని ఇజ్రాయెల్‌ సైన్యం అనుకుంటుందో వాళ్ల ప్రాణాలనే బలిగొంటోంది.

ఇజ్రాయెల్ సరిహద్దు సమీపంలోని ఈజిప్టు పట్టణాన్ని ఇజ్రాయెల్ మిసైల్ తాకిన ఘటనలో 50 మంది బందీలు మరణించినట్టు హమాస్ ప్రకటించింది. వెస్ట్‌బ్యాంక్‌లో రాతంత్రా జరిపిన దాడుల్లో 60 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ అరెస్ట్ చేసింది. మరోవైపు యుద్ధం ఇప్పట్లో ఆగే సంకేతాలు కనిపించకపోవడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాలస్తీనా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు అవసరమైన సామగ్రిని సరఫరా చేసేందుకు అనుమతించాలని ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకొస్తోంది.

Updated On 27 Oct 2023 1:28 AM GMT
Ehatv

Ehatv

Next Story