ఇజ్రాయెల్‌(Israel)-హమాస్‌(Hamas) మధ్య జరుగుతున్న భీకర యుద్ధం(War) అమాయక ప్రాణాలను తీసుకుంటోంది. ముఖ్యంగా గాజాలో(Gaza) పరిస్థితి భయంకరంగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఇజ్రాయెల్‌(Israel)-హమాస్‌(Hamas) మధ్య జరుగుతున్న భీకర యుద్ధం(War) అమాయక ప్రాణాలను తీసుకుంటోంది. ముఖ్యంగా గాజాలో(Gaza) పరిస్థితి భయంకరంగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎక్కడ్నుంచి ఎప్పుడు ప్రాణాలకు ముప్పువాటిల్లుతుందో తెలియక అల్లాడిపోతున్నారు. దూసుకొస్తున్న రాకెట్లు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆకలిదప్పులతో(Hunger-thirst) ప్రజలు అల్లాడిపోతున్నారు. బాంబుల దాడులతో పెద్ద పెద్ద భవంతులు నేలకూలుతున్నాయి.

గాజాలో ప్రజలు ఇజ్రాయెల్‌ బలగాల నిర్బంధంలో చిక్కుకున్నారు. గాజాలో ఇప్పుడు కరెంట్‌(Current) లేదు, తాగేందుకు నీరు లేదు, తినడానికి తిండి లేదు. అన్ని దారులు మూసుకుపోయాయి. చివరకు ఈజిప్టు(Egypt) కూడా తన సరిహద్దును మూసేసింది. గాజాలో ఇంచుమించు పాతిక లక్షమంది ప్రజలు ఉన్నారు. వీరంతా అల్లాడిపోతున్నారు. ప్రాణాలు నిలుపుకోవడం కోసం దొరికిన ఉప్పు నీరును తాగుతున్నారు. అపరిశుభ్రమైన నీటిని వాడుతున్నారు. ఇజ్రాయెల్‌ కరుణిస్తే తప్ప వారికి ఆహారం, మంచినీరు దొరకదు. ఇజ్రాయెల్‌ కరుణించాలంటే హమాస్‌ చేతిలో ఉన్న బందీలు విడుదల కావాలి. బందీలను హమాస్‌ ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియదు.

ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లో కసి పెరిగింది. హమాస్‌ మిలిటెంట్లను అంతం చేయడమే టార్గెట్‌గా పెట్టుకుంది. ఇజ్రాయెల్‌ సైన్యం దూసుకుపోతున్నది. గాజాలో ఇప్పటి వరకు 2,329 మంది పాలస్తీనియన్లు చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్‌ దాడిలో ఇజ్రాయెల్‌లో 1.300 మందికిపైగా జనం చనిపోయారు. ఏడు వేల మందికి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు ఉత్తరగాజాను వెంటనే ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు చేయడంతో లక్షలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తరలివెళుతున్నారు. వీరి కోసం రెండు సురక్షిత కారిడార్లను ఇజ్రాయెల్‌ ఏర్పాటు చేసింది.

ఉత్తర గాజా క్రమంగా ఖాళీ అవుతోంది. పది లక్షల మందికిపైగా జనం తరలివెళ్లాలంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు. కనీసం పది రోజులైనా పడుతుంది.
మరోవైపు హమాస్‌ ఆధీనంలో ఉన్న 150 మంది బందీల సమాచారం తెలియడం లేదు. బందీలను వెంటనే విడిపించాలని డిమాండ్‌ చేస్తూ వారి కుటుంబ సభ్యులు టెల్‌ అవీవ్‌లోని ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు.ఇదిలాఉంటే,

ఈజిప్టు–గాజా మధ్యనున్న రఫా సరిహద్దును తెరిపించేందుకు అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈజిప్టుతో చర్చిస్తోంది. గాజా ప్రజల కోసం వివిధ దేశాలు అందచేసిన ఆహారం, ఔషధాలు, ఇతర నిత్యావసరాలు ప్రస్తుతం ఈజిప్టులో ఉన్నాయి. వాటిని గాజాకు చేర్చడానికి సరిహద్దును తెరవాలని అమెరికా అంటోంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు ఆయుధ సాయం అందిస్తోంది. ఇప్పటికే ఒక యుద్ధవిమాన వాహక నౌకను మధ్యదరా సముద్రానికి పంపించింది."Written By : Senior Journalist M.Phani Kumar"

Updated On 17 Oct 2023 6:35 AM GMT
Ehatv

Ehatv

Next Story