గాజాలో ఇజ్రాయెల్‌(Israel) యుద్ధ విమానాలు రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. హమాస్‌(Hamas) మిలిటెంట్లనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. రాకెట్ల దాడిలో భవంతులు నేల కూలుతున్నాయి. వందల సంఖ్యలో సామాన్య ప్రజలు చనిపోతున్నారు. ప్రస్తుతం గాజాలో(Gaza) భయానక పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

గాజాలో ఇజ్రాయెల్‌(Israel) యుద్ధ విమానాలు రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. హమాస్‌(Hamas) మిలిటెంట్లనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. రాకెట్ల దాడిలో భవంతులు నేల కూలుతున్నాయి. వందల సంఖ్యలో సామాన్య ప్రజలు చనిపోతున్నారు. ప్రస్తుతం గాజాలో(Gaza) భయానక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. శిథిల భవంతులపై దట్టంగా దుమ్ము ధూళీ ఆవరించాయి. బాంబులు వెదజల్లిన పొగ గాజాను కమ్మేసింది. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.

శిథిలాల కింద ఎన్ని శవాలు ఉన్నాయో తెలియడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు రాకెట్ల దాడిని కొనసాగిస్తున్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని అష్కెలాన్‌ నగరంపై భారీగా రాకెట్లను ప్రయోగించారు. అయిదు రోజుల యుద్ధంలో ఇప్పటికే రెండువేల మందికిపైగా చనిపోయారు. తమ దేశానికి చెందిన 155 మంది సైనికులు, 12 వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్‌ అధికారులు ప్రకటించారు. గాజాలోనే వెయ్యి మందికిపైగా చనిపోయారని చెప్పారు. వీరిలో 260 మంది చిన్నారులు, 230 మంది మహిళలు ఉన్నారన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చు.

మరోవైపు, ఉత్తర ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లో లెబనాన్, సిరియా నుంచి తీవ్రవాదులు ఇజ్రాయెల్‌ సైన్యంపై దాడికి దిగుతున్నారు. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు గాజాలో దారులన్నీ మూసుకుపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అష్టదిగ్బంధనంలో గాజా చిక్కుకుంది. ఆహారం, ఇంధనం, మందులు నిండుకున్నాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అంతటా అంధకారం అలుముకుంది. ఆసుపత్రులలో క్షతగాత్రుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.

ఆసుపత్రులలో మందులు లేవు. సరైన వైద్య పరికరాలు లేవు(HEalth facilities). యుద్ధంలో గాయపడిన వారికి శస్త్ర చికిత్సలు చేయలేక వైద్యులు చేతుతెల్తేస్తున్నారు. గాజాకు ఇతర దేశాల నుంచి మందుల సరఫరా కోసం సురక్షిత కారిడార్లు ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు వేడుకుంటున్నాయి.
ఇంధనం లేక గాజాలోని ఏకైక విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం మూతపడింది. ఇంధన సరఫరాను ఇజ్రాయెల్‌ నిలిపివేసింది. ఈజిప్టు కూడా తమ సరిహద్దును మూసేసింది. గాజా నుంచి రాకపోకలను అనుమతించడం లేదు.

గాజాలో రెండున్నర లక్షల మందికిపైగా ప్రజలు సొంత ఇళ్లు వదిలేసి, ఐక్యరాజ్య సమితి శిబిరాలలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇదిలాఉంటే హమాస్‌ మిలిటెంట్లు అపహరించిన 150 మందికిపైగా ప్రజల ఆచూకి ఇంకా తెలియరాలేదు. హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్నవారు ఎలా ఉన్నారో తెలియక కుటుంబసభ్యులు, బంధుమిత్రులు తల్లడిల్లిపోతున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా గాజాపై ఇజ్రాయెల్‌ దాడి చేసిన ప్రతిసారీ ఒక్కో బందీని చంపేస్తామని హమాస్‌ మిలిటెంట్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. హమాస్‌ అపహరించిన 150 మందిలో ఇజ్రాయెల్‌ సైనికులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గాజాలో రహస్య సొరంగాల్లోకి వారిని తరలించినట్లు ఇజ్రాయెల్‌ అనుమానిస్తోంది.

Updated On 12 Oct 2023 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story