ప్రపంచంలో సగం దేశాలు అలజడి, హింస, యుద్ధాలతో నరకంగా మారాయి.

ప్రపంచంలో సగం దేశాలు అలజడి, హింస, యుద్ధాలతో నరకంగా మారాయి. అందులో పపువా న్యూగినియా(Papua New Guinea) కూడా ఒకటి. సాయుధ గ్యాంగులు సామన్య ప్రజలను ప్రశాంతంగా బతకడివ్వడం లేదు. ఉత్తర ప్రాంతంలోని ఓ మారుమూల మూడు గ్రామాలలో దాదాపు 26 మందిని ఈ ముఠా హత్య చేసింది. ఈ విషయాన్ని పపువా న్యూగినియా పోలీసు వర్గాలే కాకుండా ఐక్య రాజ్యసమితి కూడా చెప్పింది. మృతులలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. దాదాపు 30 మంద సాయుధులు ఈ పాతకానికి ఒడిగట్టారు. కొన్ని మృతదేహాలు అయితే కుళ్లిపోయాయి. మరికొన్ని మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. తలలు నరికి హత్య చేశారు. గ్రామంలోని ఇళ్లను కూడా దుండగులు దహనం చేశారు. చాలా మంది పోలీసుల రక్షణలో బిక్కు బిక్కుమంటు గడుపుతున్నారు. దేశంలో ఆరు నెలలుగా శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. ఈ హత్యలకు కారణం భూ వివాదాలేనని పోలీసులు చెబుతున్నారు. ఇంతకు ముందు కూడా హైల్యాండ్స్‌ ప్రాంతంలో 26 మందిని ఇలాగే హత్య చేశారు.

Eha Tv

Eha Tv

Next Story