Fungal Viru In America : అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రమాదకర వైరస్!
రోజుకో వైరస్(Virus) పుట్టుకొస్తూ మానవాళికి సవాల్ విసురుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో(america) అత్యంత ప్రమాదకర ఫంగల్ వైరస్(Fungal virus) క్యాండిడా ఆరిస్(Candida auris) వేగంగా విస్తరిస్తోంది. వాషింగ్టన్లో చాలా మంది ఈ వైరస్ బారిన పడ్డారు.
రోజుకో వైరస్(Virus) పుట్టుకొస్తూ మానవాళికి సవాల్ విసురుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో(america) అత్యంత ప్రమాదకర ఫంగల్ వైరస్(Fungal virus) క్యాండిడా ఆరిస్(Candida auris) వేగంగా విస్తరిస్తోంది. వాషింగ్టన్లో(Washington) చాలా మంది ఈ వైరస్ బారిన పడ్డారు. కొత్త వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రులలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తున్నదని, ఈ వైరస్ శక్తివంతమైన యాంటీఫంగల్ మందులను కూడా తట్టుకుంటున్నదని వైద్యులు తెలిపారు. అమెరికాలో క్యాండిడా ఆరిస్ మొదటి కేసు జనవరి 10వ తేదీన నమోదయ్యింది. వైరస్ బారిన పడినవారిలో ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయట! అయితే వైరస్ సోకిన వారికి ప్రత్యేక లక్షణాలేవీ బయటకు కనిపించడం లేదు. ఇదే వైద్యులకు ఆందోళన కలిగిస్తున్నది. క్యాండిడా ఆరిస్ వైరస్‌ను మొదటిసారిగా పదిహేనేళ్ల కిందట జపాన్‌లో గుర్తించారు. అమెరికాతో పాటుగా మరో 40 దేశాలలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.