అది ప్రపంచంలోకల్లా అత్యంత పదునైన కరవాలం! అద్భుతాలు కలిగిన ఆ ఖడ్గం(Sword) కింగ్‌ ఆర్థర్‌కు(King Arthur) చెందింది! భూమికి 32 అడుగుల పైన పాతిపెట్టిన ఆ చారిత్రక ఖడ్గం(Sword) మాయమయ్యింది.

అది ప్రపంచంలోకల్లా అత్యంత పదునైన కరవాలం! అద్భుతాలు కలిగిన ఆ ఖడ్గం(Sword) కింగ్‌ ఆర్థర్‌కు(King Arthur) చెందింది! భూమికి 32 అడుగుల పైన పాతిపెట్టిన ఆ చారిత్రక ఖడ్గం(Sword) మాయమయ్యింది. దొంగలెత్తుకెళ్లారా? లేక అదే అదృశ్యమయ్యిందా? ఏమో ఎవరూ చెప్పలేకపోతున్నారు. దక్షిణ ఫ్రాన్స్‌లోని(South France) రోకమడోర్‌ పట్టణంలో ఈ కరవాలం ఉండింది. సుమారు 13 వందల ఏళ్లుగా బండరాయిలో సగం దిగబడి ఉన్న ఆ ఖడ్గం ఇప్పుడు మాయం కావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరైనా ఆ కత్తిని ఎత్తుకెళ్లాలంటే కఠనమైన రాతి ఉపరితలంపై 32 అడుగులు పైకి ఎక్కవలసి ఉంటుంది. అంత ఎత్తుకు ఎక్కి ఆ కరవాలాన్ని దొంగిలించడం మానవమాత్రులకైతే సాధ్యం కాదన్నది స్థానికుల బలమైన నమ్మకం. అందుకే ఆందోళన చెందుతున్నారు. ఇది అరిష్టమేనని భయపడుతున్నారు. శతాబ్దాలుగా రోకామడోర్‌ పట్టణానికి అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్‌గా ఈ ఖడ్గం నిలుస్తూ వచ్చిందని పట్టణ మేయర్‌ డోమినిక్‌ లెన్‌ఫెంట్ తెలిపారు. ఆ ఖడ్గానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయన్నది స్థానికుల బలమైన నమ్మకం. డురండల్‌గా పిల్చుకునే ఆ కత్తిని ఫ్రెంచ్‌ ఎక్స్‌ క్యాలిబర్‌ అని కూడా అంటారు. ప్రపంచంలోనే ఇది అత్యంత పదునైన కత్తి. ఒక్క దెబ్బతో రాయిని కూడా చీల్చగలదని చెబుతారు. ఈ కరవాలానికి నాశనం లేదని అంటారు. పురాణాల ప్రకారం ఎనిమిదో శతాబ్దంలో అప్పటి రోమన్‌ చక్రవర్తి చార్లెమాగ్నే ఒక దేవదూత నుంచి ఈ కరవాలాన్ని అందుకున్నాడు. తదనంతరం దీన్ని సైనికాధికారి రోలాండ్‌కు ఇచ్చాడు. చనిపోవడానికి ముందు రోలాండ్‌ ఈ ఖడ్గం ఎవరి చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నాడు. అది శత్రువుల చేతికి చిక్కకుండా ఉండేందుకు రాళ్లపై దాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. అతడి ప్రయత్నాలు వృధా అయ్యాయి. ఎలాగైనా దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో బలంగా గాల్లోకి విసిరాడు. అది వందల కిలోమీటర్లు ప్రయాణించి రోకామడోర్‌ రాక్‌ ఫేస్‌లో దిగబడింది.

Eha Tv

Eha Tv

Next Story