ఫ్రాన్స్ రాజ్యాంగంలో అబార్షన్ హక్కులను పొందుపరిచే బిల్లును ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు

ఫ్రాన్స్ రాజ్యాంగంలో అబార్షన్ హక్కులను పొందుపరిచే బిల్లును ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు సోమవారం ఆమోదించారు. గర్భం వద్దనుకునే హక్కును మహిళలకు ఇచ్చిన ఏకైక దేశం ఇదే. అబార్షన్‌పై వచ్చిన ఈ బిల్లుకు ఎంపీలు అనూహ్య మద్దతు పలికారు. బిల్లును కేవలం 72 మంది ఎంపీలు వ్యతిరేకించారు. గర్భస్రావాన్ని రాజ్యాంగ హక్కుగా మార్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది. ప్రధాని గాబ్రియేల్ అట్టల్ మాట్లాడుతూ.. మీ శరీరం మీది. ఈ విషయంలో ఇతరులు నిర్ణయం తీసుకోలేరని సభలో వ్యాఖ్యలు చేశారు. ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్లెస్‌లో 780-72 ఓట్లతో ఈ బిల్ కు ఆమోదం పలికారు. అబార్షన్ గురించి ఫ్రాన్స్ లో విపరీతమైన చర్చ జరిగింది. ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో హాలులో ఉన్న పలువురు మహిళా శాసనసభ్యులు హర్షధ్వానాలు చేశారు.

‘అబార్షన్ రాజ్యాంగబద్ధ హక్కు కాదు’ అని 2022లో అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఈ విషయంలో ఫ్రాన్స్‌లో ఉద్యమాలు జరిగాయి. అబార్షన్‌కు రాజ్యాంగ చట్టబద్ధత కల్పించాల్సిందేనని కోరారు. ఫ్రాన్స్‌లో అబార్షన్ హక్కులను విస్తృతంగా ఆమోదించడంతో.. ఇప్పుడు చట్టంలో పొందుపరిచారు. ఈ చట్టానికి ప్రజల మద్దతు కూడా లభించింది. దాదాపు 80 శాతం మంది ఫ్రాన్స్ ప్రజలు అబార్షన్ చట్టబద్ధమైనదనే సమర్ధిస్తున్నారు. ఈ నిర్ణయంతో అబార్షన్ హక్కుల కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

Updated On 5 March 2024 12:21 AM GMT
Yagnik

Yagnik

Next Story