వైద్య విద్యను అభ్యసించడానికి రష్యా(Russia)కు వెళ్లిన నలుగురు భారతీయులు(Indians) నదిలో మునిగి చనిపోయారు. సెయింట్ పీటర్స్‌బర్గ్(Saint Petersburg) సమీపంలో ఉన్న నదిలో వారు మునిగిపోయారు. విద్యార్థుల మృతదేహాలను భారత్‌కు పంపించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్టు ఇండియన్‌ ఎంబసీ తెలిపింది. నోవోగ‌రోడ్ సిటీలో ఉన్న స్టేట్ యూనివ‌ర్సిటీ(Sate University)లో ఆ విద్యార్థులు వైద్య విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వీరంతా 18 నుంచి 20 ఏళ్ల వయసు ఉన్నవారే. ఓ అమ్మాయి […]

వైద్య విద్యను అభ్యసించడానికి రష్యా(Russia)కు వెళ్లిన నలుగురు భారతీయులు(Indians) నదిలో మునిగి చనిపోయారు. సెయింట్ పీటర్స్‌బర్గ్(Saint Petersburg)
సమీపంలో ఉన్న నదిలో వారు మునిగిపోయారు. విద్యార్థుల మృతదేహాలను భారత్‌కు పంపించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్టు ఇండియన్‌ ఎంబసీ తెలిపింది. నోవోగ‌రోడ్ సిటీలో ఉన్న స్టేట్ యూనివ‌ర్సిటీ(Sate University)లో ఆ విద్యార్థులు వైద్య విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వీరంతా 18 నుంచి 20 ఏళ్ల వయసు ఉన్నవారే. ఓ అమ్మాయి న‌ది నీటిలో కొట్టుకుపోతున్న స‌మ‌యంలో ఆమెను ర‌క్షించేందుకు మిగితా ముగ్గురు న‌దిలోకి దిగారు. అయితే వాళ్లు కూడా ఆ న‌ది నీటిలో మునిగిపోయారు. వాళ్ల‌తో ఉన్న మ‌రో విద్యార్థి మాత్రం ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డ్డారు. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ఓ విద్యార్థికి చికిత్స అందిస్తున్న‌ట్లు మాస్కో(Moscow)లోని భార‌తీయ ఎంబ‌సీ పేర్కొన్న‌ది.

Updated On 7 Jun 2024 4:23 AM GMT
Ehatv

Ehatv

Next Story