ఈ అనంతానంత విశ్వంలో మనం ఒంటరివారమేనా? మనలాంటి బుద్దిజీవులు ఇతర గ్రహాలలో ఉన్నారా? ఉంటే ఎలా ఉంటారు? మనలాగే ఉంటారా? మరో రకంగా ఉంటారా? గ్రహాంతర వాసులు మనకన్నా తెలివైన వారా? ఇలాంటి సందేహాలు మనిషి బుద్ధి పెరిగినప్పట్నుంచి వస్తున్నాయి. గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడో ఆసక్తికరమైన విషయం తెలిసింది.

ఈ అనంతానంత విశ్వంలో మనం ఒంటరివారమేనా? మనలాంటి బుద్దిజీవులు ఇతర గ్రహాలలో ఉన్నారా? ఉంటే ఎలా ఉంటారు? మనలాగే ఉంటారా? మరో రకంగా ఉంటారా? గ్రహాంతర వాసులు మనకన్నా తెలివైన వారా? ఇలాంటి సందేహాలు మనిషి బుద్ధి పెరిగినప్పట్నుంచి వస్తున్నాయి. గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడో ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఇతర గ్రహాల మీద జీవులు ఉన్నారని, ఇందుకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా(america) దగ్గర అనేక రుజువులు ఉన్నాయని ఓ మాజీ నిఘా అధికారి అనడం సంచలనం సృష్టిస్తోంది. అయితే ఆ సాక్ష్యాలను అమెరికా బయటకు రాకుండా దాచిపెడుతున్నదని ఆరోపిస్తున్నారా అధికారి. అలా దాచిపెట్టడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటో తెలియదు కానీ మాజీ నిఘా అధికారి ఇచ్చిన స్టేట్‌మెంట్ మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. ఆ అమెరికా మాజీ నిఘా అధికారి పేరు డేవిడ్‌ గ్రుష్(David Grush) తన దేశ ప్రభుత్వంపైనే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. గ్రహాంతరవాసులు యూఎఫ్‌వోలో(UFO) భూమ్మీదకు వస్తుంటారని నమ్మువారు చాలా మందే ఉన్నారు.

అంటే అన్‌ఐడెంటిఫైడ్‌ ప్లైయింగ్‌ అబ్జెక్ట్(Unidentified Flying Object) అన్నమాట! ఇప్పుడు ఆ మాటకు బదులుగా యూపీఏ(UPA) అంటున్నారు. ఎలాబరేట్‌ చేస్తే అన్‌ఐడెంటీఫైడ్ అనోమాలస్‌ ఫెనోమీనన్‌ అవుతుంది. ఇందులోంచి సేకరించిన మానవేతర అవశేషాలపై అమెరికా పరిశోధనలు చేస్తున్నదని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను నిఘా వర్గాలు గతంలోనే ప్రభుత్వానికి సమర్పించాయని డేవిడ్‌ గ్రుష్‌ అంటున్నారు. వాషింగ్టన్‌లో ఓ కమిటీ ముందు బుధవారం ఈ వాంగ్మూలం ఇచ్చారాయన!
క్రాష్డ్‌ క్రాఫ్ట్స్‌(Crashed crafts), దాని పైలట్లు నిజమేనా? అనే ప్రశ్నకు ఆయన అవునని సమాధానం ఇచ్చారు. దీని గురించి తనకు ప్రత్యక్ష సమాచారం ఉందన్నారు. దశాబ్దాలుగా ఇందుకు సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. అమెరికా ప్రభుత్వంపై జూన్‌లోనే ఆరోపణలు చేశారు డేవిడ్‌ గ్రుష్‌. ఈ ఆరోపణలపై రిపబ్లికన్‌ కమిటీ దర్యాప్తు చేస్తోంది. గ్రహాంతరవాసుల అవశేషాలను తాను ప్రత్యక్షంగా చూడకపోయినా హైలెవల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారుల నుంచి తనకు సమాచారం ఉందంటున్నారు గ్రుష్‌. అయితే గ్రుష్‌ చేస్తున్న ఆరోపణలను అమెరికా ప్రభుత్వం తోసిపుచ్చింది. గ్రహాంతరవాసులకు సంబంధించి పరిశోధకులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఓ రక్షణ అధికారి చెప్పారు.

Updated On 28 July 2023 2:23 AM GMT
Ehatv

Ehatv

Next Story