పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ ప్రశంసలు కురిపించాడు. దావూద్‌ ఇబ్రహీంతో కుటుంబ సంబంధాలు నెరపడం గౌరవంగా భావిస్తున్నానన్నారు.

పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ ప్రశంసలు కురిపించాడు. దావూద్‌ ఇబ్రహీంతో కుటుంబ సంబంధాలు నెరపడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. దీంతో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముస్లింల ప్రయోజనాల కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తిగా అభివర్ణించారు.

ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్ మియాందాద్ మాట్లాడుతూ "నాకు అతను దుబాయ్ నుండి చాలా కాలంగా తెలుసు. అతని కుమార్తె నా కొడుకును వివాహం చేసుకోవడం నాకు గొప్ప గౌరవం. నా కోడలు చాలా చదువుకుందని తెలిపాడు. ప్రజలు దావూద్ ఇబ్రహీం కుటుంబం గురించి ఒక అపోహను సృష్టించారు. అసలు దావూద్ ఇబ్రహీంను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అతని కుటుంబం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అది అస్సలు కాదన్నాడు.

2005 దుబాయ్‌లో మియాందాద్ కుమారుడు జునైద్ దావూద్ ఇబ్రహీం కుమార్తె మహరుఖ్‌ను వివాహం చేసుకున్నాడు. దావూద్ ఇబ్రహీం భారతదేశంలో వాంటెడ్ టెర్రరిస్టు. దాదాపు 250 మంది మరణించిన 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో సూత్రధారి.

అతడు 1970లలో ముంబైలో D-కంపెనీని స్థాపించాడు. దావూద్ పాకిస్థాన్‌లోని అతిపెద్ద నగరమైన కరాచీలోని పాష్ క్లిఫ్టన్ ప్రాంతంలో నివసిస్తున్నాడని నివేదిక‌లు చెబుతున్నాయి. అయితే.. దీనిని పాకిస్థాన్ మాత్రం ఖండిస్తోంది.

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ తన 20 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 124 టెస్టులు, 233 వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్‌లు ఆడాడు. అతడును టెస్ట్ క్రికెట్‌లో 8,832 పరుగులు చేశాడు. అందులో 23 సెంచరీలు చేయ‌గా.. వన్డేల‌లో అతను ఎనిమిది సెంచరీలతో 7,381 పరుగులు చేశాడు. 66 ఏళ్ల జావేద్ మియాందాద్ పాకిస్థాన్ జాతీయ జట్టుకు మూడుసార్లు కోచ్‌గా కూడా పనిచేశాడు.

Updated On 19 March 2024 11:25 PM GMT
Yagnik

Yagnik

Next Story