Dries van Agt : ఆ భార్యభర్తలు చేతిలో చేయి వేసుకుని చనిపోయారు...!
వార్ధక్యంలోకి వచ్చిన తర్వాత రోజులు లెక్కపెట్టుకోవడమే మిగులుతుంది. ముసలితనం బాధే అయినా భగవంతుడి పిలుపు వచ్చేవరకు భరించక తప్పదు. వృద్ధాప్యంలో అడుగుపెట్టినవారు కాసింత తోడు కోసం తహతహలాడతారు. ఆ స్థితిలో భార్యభర్తలలో ఎవరు పోయినా మరొకరి బతుకు నరకప్రాయం అవుతుంది. ఆ బెంగతోనే మిగిలినవారు కన్నుమూస్తారు. భర్త ఒడిలోనే సుమంగళిగా పోవాలని చాలా మంది భార్యలు కోరుకుంటారు. కొందరు మరణాన్ని కూడా కలిసే పంచుకోవాలనుకుంటారు. చేతిలో చేయి వేసుకుని చనిపోతే బాగుంటుందని భావిస్తారు. అలాంటి భావనే నెదర్లాండ్స్(Netherlands) మాజీ ప్రదాని డ్రైస్ వాన్ ఆగ్ట్‌కు(Dries van Agt) వచ్చింది.

ఈయన 1977 నుంచి 1982 మధ్య కాలంలో ప్రధానిగా పనిచేశాడు. క్రిస్టియన్ డెమోక్రటిక్ అప్పీల్(Christian Democratic Appeal) అనే పార్టీని కూడా స్థాపించాడు. 2009లో పాలస్తీనా హక్కుల కోసం వాదించేందుకు ది రైట్స్ ఫోరం అనే సంస్థను స్థాపించాడు. నిజాయితీకలిగిన నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. ఆయన భార్య పేరు యూజీనీ. ప్రస్తుతం డ్రైస్ వాన్ ఆగ్ట్ వయసు 93 ఏళ్లు. యూజీనీ వయసు కూడా సుమారు అంతే ఉంటుంది. 2019లో డ్రైస్‌కు బ్రెయిన్ హేమరేజ్ వచ్చింది. అప్పట్నుంచి ఆయన మంచానికే పరిమితమయ్యారు. గత కొంతకాలంగా యూజీనీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటూ వస్తోంది. ఆమె కూడా మంచానికే పరిమితయ్యారు. ఇద్దరూ ఇలా బెడ్ మీదనే ఉండటమే విషాదం. ఇద్దరిలో ఎవరు ముందు చనిపోయినా మరొకరు తట్టుకోలేరు. అంతటి బాండింగ్ ఇద్దరి మధ్యన ఉంది. అందుకే ఇద్దరూ కలిసి చనిపోవాలని అనుకున్నారు.
ద్వంద్వ అనాయాస మరణాన్ని ఆశ్రయించారు. ఫిబ్రవరి 5వ తేదీన డ్రైస్ వాన్ ఆగ్ట్, యూజీనీ తమ స్వస్థలమైన నిజ్ మెగన్‌లో ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని చనిపోయారు. ఏడు దశాబ్దాల దాంపత్యం వారిది. 70 ఏళ్ల పాటు కష్టాన్ని , సుఖాన్ని కలిసిపంచుకున్నారు. ఆనంద విషాదాలను ఒకేలా ఆస్వాదించారు. డ్రైస్ వాన్ అగ్ట్ తన భార్యను మై డాటర్ అని సంబోధించేవారు. ద్వంద్వ అనాయాస మరణం అంటే ఇద్దరు వ్యక్తులు ఏకకాలంలో ప్రాణాంతక ఇంజెక్షన్ తీసుకుని చనిపోవడం. నెదర్లాండ్స్‌లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. 2021లో 13 జంటలు, 2022లో 29 జంటలు ఇలాగే ప్రాణాలు విడిచాయి. ఇంగ్లీష్‌లో దీన్ని duoEuthanasia అంటారు. నెదర్లాండ్స్‌లో ఏటా దాదాపు వెయ్యి మంది వ్యక్తులు అనాయాస మరణం కోసం సంప్రదిస్తున్నట్లు ఎక్స్ పర్టి సెంట్రమ్ యుతనాసి ప్రతినిధి ఎల్కే స్వార్డ్ అంటున్నారు. నెదర్లాండ్ 2002 నుంచి ఈ అనాయాస మరణాన్ని చట్టం చేసింది. ఆరు షరతులతో దీన్ని అమలు చేశారు. అయితే ఇలా కారుణ్య మరణం కావాలనుకునేవారు అందుకు బలమైన కారణాలు చూపించాల్సి ఉంటుంది. మరోవైపు అమెరికా, ఆసియా, యూరప్ లోని కొన్ని దేశాలు ఇలాంటి మరణాలను నిషేధిస్తూ చట్టాలు రూపొందించాయి. నెదర్లాండ్ మాజీ ప్రధాని, ఆయన భార్య అనాయస మరణం పొందడం పట్ల ప్రపంచ దేశాల అధిపతులు సంతాపం వ్యక్తం చేశారు.