ఆఫ్రికాలోని గినియాలో ఘోరం జరిగింది. ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో అభిమానులు ఘర్షణ పడ్డారు.

ఆఫ్రికాలోని గినియాలో ఘోరం జరిగింది. ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో అభిమానులు ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. హింసాత్మకంగా మారింది. రెండు వర్గాల వారు ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకున్నారు. ఇందులో వంద మందికిపైగా మరణించారు.

గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం దేశంలోని రెండో అతిపెద్ద నగరం జెరెకొరె నగరంలో ఓ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. దాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు గ్రౌండ్‌లోకి జొరబడ్డారు. అవతలి జట్టు అభిమానులు కూడా గ్రౌండ్‌లోకి వెళ్లి వీరిని అడ్డుకున్నారు. దాంతో గొడవ మొదలయ్యింది. వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. కొందరు పోలీస్‌స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీధుల్లో ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ehatv

ehatv

Next Story